వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు హద్దు లేకుండా పోయిందని గృహలక్ష్మి పేరుతో ప్రజలకు ఆశలు రేపి తమాషా చూస్తున్న ప్రభుత్వం గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో గృహ లక్ష్మికి అర్హులు అయినటువంటి మహిళలు వెంటనే సంబంధిత మండలాలలో అప్లైలు చేసుకోవాలని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాలని ప్రజలను కోరిన ప్రభుత్వం 3 రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పడంతో ప్రజలకు ఏంచేయాలో తెలియని స్థితిలో ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్య పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ లో ఇల్లు ఇస్తామని ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు ఇవ్వలేదని ఎలక్షన్లు దగ్గర పడడంతో ప్రజలకు గృహలక్ష్మి అనే మోసపూరితమైన స్కీములు తెచ్చి గ్రామాలలో ఖాళీ స్థలాలు ఎవరి పేరు పైన లేని తరుణంలో వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావాలని చివరి తేదీ రెండు రోజుల్లో ఉండడంతో జనం ఏం చేయాలో తోచక తల పట్టుకుంటున్నారు. వైన్ షాపులకు 15 రోజులకు గడివిస్తూ గృహ లక్ష్మికి 3 రోజుల గడువు ఏమిటని ఆయన అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల పరిపాలన సంబరాలు జరుపుకుంది గాని ఒక్క నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చలేక పోయే డబుల్ బెడ్ రూములు ప్రచారం గానీ పంపకాలు ఒక్కటి కూడా జరగకుండా చివరికి రాష్ట్ర ప్రభుత్వ పదేళ్ల నుండి ఊరించి తూ…తూ మంత్రంగా నిరుపేదలకు గృహ నిర్మాణాలకు సహాయం అందించేలా దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి చివరిగా ఒక ప్రకటన చేసి దానిని రెండు రోజుల గడువులో ప్రకటించిన ఏమిటని ప్రశ్నించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైన్ షాపులో టెండర్లకు 15 రోజులు గడువు పెట్టి దరఖాస్తు తీసుకున్న ప్రభుత్వం 3 రోజుల్లో గృహలక్ష్మికి లబ్ధిదారుడు నుండి ఎలా దరఖాస్తులు చేసుకుంటారని గ్రామాల్లో స్థితిలో వ్యవస్థల్లో ఉన్న ఇండ్లను ప్రభుత్వం అధికారులు పరిశీలన చేసి గుర్తించి గృహలక్ష్మిలో వారికి స్థానం కల్పించాలి. ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెళ్లయిన వేరు కుటుంబాలకు సంసారాలు చేసుకునే వారికి ఇంటి స్థలం లేని నిరుపేదలకు గృహలక్ష్మి వర్తింపజేయాలని ప్రస్తుతం ఉన్న ధరలకు మూడు లక్షలతో నిర్మాణాలు సాధ్యమవుతాయా దానికి ప్రభుత్వం నుండి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు సెల్ఫ్ సర్టిఫికెట్లు దీంతోపాటు ఇంటి పన్ను అదేవిధంగా మహిళ పేరుపై ఉండాలి అంటున్నారు మీరిచ్చిన గడువులో మండల ఆఫీసులలో క్యాస్టింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి వారం రోజులు టైం తీసుకునే అధికారులు రెండు రోజుల్లో ప్రజలు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రంలో ప్రస్తుతం పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇచ్చే మూడు లక్షల రూపాయలలో ఇల్లు నిర్మించుకోవడానికి పేద కుటుంబాలకు సాధ్యమవుతుందా అని అదేవిధంగా ఇచ్చే గృహలక్ష్మి స్కీం లో మూడు లక్షల బదులు ఐదు లక్షలు ఇస్తే ఎంతోకొంత కొద్దిగా ఇల్లు నిర్మించుకోవడానికి సాధ్యమవుతుందని ఇప్పటికీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రజలకు ఇప్పటివరకు ఇవ్వలేదని ప్రజలను ఏదో విధంగా నమ్మించి మోసం చేసే పనిలో పడ్డారని ఎలాగైనా లేనిపోని స్కీములు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ అన్ని స్కీములు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించి బంగారు తెలంగాణకు బదులు తాగుబోతుల తెలంగాణను చేసిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన బుద్ధి చెబుతుందని ఆయన అన్నారు.