మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారి గంజాయి. గంజాయి విక్రయాలు చాప కింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే ఉంది. కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన కొందరు యువకులు గంజాయి మత్తులో జోగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాగా మల్కాజిగిరి ఎస్వోటి టీమ్ పక్కా సమాచారంతో మనోహర్, ప్రవీణ్ అనే వ్యక్తులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. మనోహర్, ప్రవీణ్ అనే వ్యక్తులు 5 వందల పది కిలోలు (102 ప్యాకెట్ లు) అక్రమంగా తరలిస్తున్న గంజాయి, ఒక వాహన్నన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మనోహర్, ప్రవీణ్ అనే వ్యక్తులు ఒరిస్సా నుండి హర్యానా హిస్సార్ కు తరలిస్తున్నారని, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని చౌహన్ తెలిపారు.