చెంచు పెంటల్లోని ప్రతి ఒక్కరికీ… అన్ని ప్రభుత్వ పథకాలు

  • అన్ని ప్రభుత్వ పథకాలు అందేవిధంగా అధికారులు కృషి చేయాలి
  • చెంచులలకు సేవ చేయడం ఆనందదాయకం
  • చెంచు ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా: రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌

అచ్చంపేట, మార్చి 26(ప్రజాతంత్ర విలేఖరి) : ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అడవి బిడ్డలైన చెంచులకు అందే విధంగా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా లింగాల మండలంలోని అప్పాపూర్‌ ‌గ్రామాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌తెలుగులోనే మాట్లాడారు. అడవిలో నివసింసించే చెంచు ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం ద్వారా కల్పించే వివిధ పథకాలకు అదనంగా గవర్నర్‌ ‌కోటా నుండి ప్రత్యేక నిధులు కేటాయిచడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా అప్పాపూర్‌లో గవర్నర్‌ ‌ప్రత్యేక నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. హెల్త్ ‌స్కానింగ్‌, ‌మహిళలకు కుట్టు మిషన్‌ ‌కేంద్రం, ఆశ్రమ పాఠశాలలో తాగు నీటికి సోలార్‌ ‌పంప్‌ ‌సెట్‌, అప్పాపూర్‌, ‌భౌరాపూర్‌ ‌పెంటలకు రెండు ద్విచక్ర వాహన అంబులెన్స్, ‌కమ్యూనిటీ షెడ్‌ ‌ప్రారంభించడంతో పాటు మహిళలకు హైజినిక్‌ ‌కిట్లు, ఇప్ప పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసిన పోషక విలువలు గలా మగువ లడ్లు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, స్టడీ మెటీరియల్‌ అం‌దజేశారు.

నల్లమల్ల దట్టమైన అడవిలో నివసిస్తున్న అడవి బిడ్డలను కలుసుకోవడం ద్వారా తన జీవితం ధన్యమయ్యిందని పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉందని, తన జీవితంలో మధురమైన జ్ఞాపకంగా ఉండిపోతుందన్నారు. రాష్ట్రంలో ఆదివాసీలు చాలామంది ఉన్నారని రాష్ట్రంలోని నాగర్‌ ‌కర్నూల్‌, ‌భదాద్రి కొత్త గూడెం, ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. వారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. చెంచులు ఆరోగ్యవంతులుగా ఉండాలని డాక్టర్‌ ‌చదివిన తాను ఆదివాసీల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుందన్నారు.

మంచి పోషకాహారం తీసుకొని తమ ఆరోగ్యం కాపాడుకోవాలని చెంచులను సూచించారు. ఆదివాసిలు అందరూ ఆరోగ్యంగా, ఉండాలని, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆదివాసీల ఉపాధికై ఐటిడిఏ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుందని, వ్యవసాయ, హార్టికల్చర్‌ ‌తదితర యూనివర్సిటీలు కృషి చేస్తున్నాయన్నారు. రెడ్‌ ‌క్రాస్‌ ఆధ్వర్యలో ఆరోగ్య శిబిరాలు, గిరిరాజా కోళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం అప్పాపూర్‌, ‌భౌరపూర్‌ ‌పెంటలను పైలట్‌ ‌ప్రాజెక్టుగా తీసుకోవడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని పెంటలను విస్తరిస్తామని తెలిపారు. ఆదివాసీలు తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మరోసారి తిరిగి వొస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ ‌కార్యదర్శి సురేంద్ర భవన్‌ ‌మాట్లాడుతూ 2021 మార్చ్ 27‌వ తేదీన రాష్ట్ర గవర్నర్‌ ‌రాష్ట్రం లోని 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని, రూ. 1.50 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఆదివాసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వంతో పాటు అదనంగా నిధులు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఆదివాసీల సమీకృత అభివృద్ధికి రెడ్‌ ‌క్రాస్‌, ఈఎస్‌ఐ, ఇతర సంస్థల ద్వారా కృషి చేయడం జరుగుతుందన్నారు. పెంటలలోని సమస్యలను జిల్లా కలెక్టర్‌ ‌ద్వారా పరిష్కారించడం జరుగుతుందని, ఇక్కడి సమస్యలను ఇంత త్వరగా పరిష్కరించినందుకు కలెక్టర్‌ ‌పి.ఉదయ్‌ ‌కుమార్‌ను ప్రశంసించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రూ. 49.90 లక్షల చెక్కును గవర్నర్‌ ‌చేతుల మీదుగా కలెక్టర్‌కు అందజేశారు.

జిల్లా కలెక్టర్‌ ‌పి. ఉదయ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ గవర్నర్‌ ‌దత్తత తీసుకున్న తర్వాత ఆదివాసీల సమీకృత అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వాటిలో భాగంగా ద్విచక్ర వాహన అంబులెన్స్, ‌ప్రతి ఇంటికి సోలార్‌ ‌విద్యుత్‌ ‌కనెక్షన్‌, ‌మిషన్‌ ‌భగీరథ ద్వారా నల్లా ద్వారా తాగు నీరు, ఐ.టి.డి.ఏ ద్వారా గిరిపోషణ పౌష్టికాహారం, ఇళ్ల మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. గిరిపోషణ పౌష్టికారం ఇవ్వడం వల్ల పెంటలలో స్యామ్‌ ‌మ్యామ్‌ ‌పిల్లలు అందరూ సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నందున కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు.అప్పాపూర్‌ ‌సర్పంచ్‌ ‌గురువయ్య మాట్లాడుతూ తమ సంక్షేమానికి కృషి చేయడమే కాకుండ తమను కలవడానికి ప్రత్యేకంగా గవర్నర్‌ ‌రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, పెంటల్లో ఒక పండగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర గవర్నర్‌ను చెంచులు తమ సాంప్రదాయ వేషధారణ, డప్పులు, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

ఐ.టి.డి.ఏ, ఐ.సి.డి.ఎస్‌, ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలోని చిన్నారులతో మాట్లాడారు. స్కానింగ్‌ ‌సెంటర్‌ ‌లో మహిళను స్కానింగ్‌ ‌చేసి పరీక్షించారు. పెంటలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి దీవెనలు తీసుకున్నారు. గూడెం లోని ఇళ్లను సందర్శించగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మీషన్‌ ‌భగీరథ ఇంటింటి నల్లా కనెక్షను ప్రారంభించారు. ఉరిమిల్ల ఆశ్రమ పాఠశాల విద్యార్ధినిలు ‘చెంచు వాళ్ళమయ్యా మేము చెంచు వాళ్ళము – కల్లా కపటం ఎరుగని అడవి బిడ్డలం’ అనే పాటపై చేసిన నృత్యం చూపరులను ఆకట్టుకున్నది. జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌పి. పద్మావతి, ఎస్పీ కె. మనోహర్‌, అదనపు కలెక్టర్‌ ‌మను చౌదరి, డి.ఎఫ్‌.ఓ ‌కిష్టా గౌడ్‌, ‌పి.ఓ. ఐ.టి.డి.ఏ అశోక్‌, ఎఫ్‌.‌డి.ఓ రోహిత్‌ ‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్‌ ‌లాల్‌, ఎం‌పిపి గీతాంజలి, సార్లపల్లి సర్పంచ్‌ ‌మల్లికార్జున్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, చెంచు ప్రజలు పాల్గొన్నారు.

చెంచు పెంటల అభివృద్ధికి నిబద్ధతతో ఉన్నాం
ఆదివాసి గిరిజన చెంచు పెంటల అభివృద్ధికి నిబద్ధతతో ఉన్నానుని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళ సై సౌందరరాజన్‌ అన్నారు. తాను దత్తత తీసుకున్న ఆదివాసి గిరిజన గ్రామాలలోని ఒకటైన నాగర్‌ ‌కర్నూలు జిల్లా ఆప్పాపూర్‌ ఆదివాసి గిరిజన చెంచు పెంటను గవర్నర్‌ ‌శనివారం సందర్శించారు. ముందుగా గవర్నర్‌ ‌కు మన్ననూరు లోని హరిత హోటల్‌ ‌వద్ద జిల్లా కలెక్టర్‌ ‌పి.ఉదయ్‌ ‌కుమార్‌,‌జిల్లా ఎస్‌పి కె.మనోహర్‌లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ ‌హరిత హోటల్‌ ‌లో మొక్కలు నాటారు. అనంతరం మన్ననూరులోని అమ్రాబాద్‌ ‌రిజర్వ్ ‌ఫారెస్ట్ ‌మృగ వని గెస్ట్ ‌హౌస్‌లో రిజర్వ్ ‌ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఫీల్డ్ ‌డైరెక్టర్‌ ‌శ్రీనివాస్‌ అ‌మ్రాబాద్‌ ‌రిజర్వ్ ‌ఫారెస్ట్ ‌లో చేపట్టిన కార్యక్రమాలపై రాష్ట్ర గవర్నర్‌ ‌కు వివరించారు. ముఖ్యంగా రిజర్వ్ ‌ఫారెస్ట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నీటి నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ, నిర్వహణ, అడవుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ కార్యకలాపాలపై వివరించారు. ఇక్కడే రిజర్వ్ ‌ఫారెస్ట్ ఆధ్వర్యంలో గిరిజన చెంచు మహిళలకు ఏర్పాటు చేసిన చేతి వృత్తుల కార్యక్రమం లబ్ధిదారులతో రాష్ట్ర గవర్నర్‌ ‌కలుసుకుని వారితో మాట్లాడారు. వారు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు.అనంతరం ఆమె లింగాల మండలం అప్పాపూర్‌ ‌గిరిజన చెంచు పెంటకు బయలుదేరి వెళ్లారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ‌కార్యదర్శి సురేంద్రమోహన్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌పి.ఉదయ్‌ ‌కుమార్‌,అదనపు కలెక్టర్‌ ‌మను చౌదరి,సి ఎఫ్‌ ‌శ్రీనివాస్‌,‌డి ఎఫ్‌ ఓ ‌కిష్టగౌడ్‌, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page