– సోలిపేట కురుమ సంఘం అధ్యక్షులు యాదయ్య
ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 20 : వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చేవేళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలం చిన్నసోలిపేట గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు కురుమ యాదయ్య అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…రాబోయే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. అధికారంలోకి వచ్చే గెలుపు మొట్టమొదట చేవెళ్ల నియోజకవర్గం నుంచి అందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలలో చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి పామేన భీం భరత్ ను భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా సైనికుల లాగా కష్టపడతామని తెలియజేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, పేదలకు భూ పంపిణీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి అధికారంలోకి వచ్చిన తర్వాత 500 కు గ్యాస్ సిలిండర్, పేదలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. అధికార పార్టీపై విసుక చెందిన ప్రజలు ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బిఆర్ఎస్ కి ఓటమి తప్పదని కురుమ సంఘం అధ్యక్షులు కురుమ యాదయ్య తెలిపారు.