నా కథలో
అడుగుదూరంలో
ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును
దగ్గరగా విన్న ఇష్టం
కలకు ప్రాణంపోసి….
ప్రవహించే ఊహగా
పరిగెత్తె ఆశగా
ఎంత వెతికినా
నడక ఎవరిదై ఉందన్న ఒక్క ప్రశ్న
ఏ క్షణం కాళ్ళు పట్టుకున్నా
జవాబు జాడ చెప్పదు.
నెర్రెలు బారిన ఆశ
పొడిబారిన కళ్లతో
ఏనాడో పుట్టి పెరిగిన ఈ రహస్యమో
గుండెలో దాచుకున్న సత్యంగా
ఏ గాలికి కొట్టుకురావాలో?
ఏ వరదకు నెట్టుకురావాలో?
– చందలూరి నారాయణరావు
9704437247