హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:జిల్లాల్లో చికిత్స పొందిన తరవాత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు నిమ్స్ లేదా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పైనా ఆధారపడవాలి వస్తుంది..రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన సూపర్ స్పెషలిటీ సేవలను అందించడానికి 10 వేల సూపర్ స్పెషలిటీ పడకలను నిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ మరియు టిమ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం శాసన సభలో టిమ్స్’ ఆక్ట్ 2023 ఆమోదించిన సంధర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ అమలు చేస్తున్న ఐదంచెల ఆరోగ్య వ్యవస్థ లో భాగంగా సూపర్ స్పెషలిటీ వంటి quaternary హెల్త్ కేర్ ను టిమ్స్ వంటి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అందించుతున్నాము అన్నారు.
టిమ్స్ హాస్పిటల్స్ ను ప్రపంచస్థాయి వైద్య విజ్ఞాన సంస్థలుగా ఏర్పాటు చేసి ప్రజలకు అత్యాధునిక వైద్యం మరియు వైద్య విద్యార్థులకు శిక్షణ అందించాలన్నది ముఖమంత్రి కెసిఆర్ గారి సంకల్పం..అన్నారు.ఈ ప్రణాళికలో భాగంగా ఏర్పర్చుతున్న టిమ్స్ హాస్పిటల్స్ కు ఏయిమ్స్ , పీజీఐ చండీగఢ్ , ఐఐటీ , ఐఐఎం మాదిరి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి టిమ్స్ ఆక్ట్ ను చట్ట సభల ఆమోదంకోసం ప్రవేశ పెట్టడమైనది..అన్నారు.ఆటోనమస్ సంస్థ కావడం వల్ల త్వరిత గతిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంటూ ఇప్పటికే నిమ్స్ ను ఆటోనమస్ ఆక్ట్ ద్వారా ఏర్పర్చడం వల్ల చాల అభివృద్ధి సాధించింది..ఇతర రాష్ట్రలుకుడా ఆటోనమస్ ఆక్ట్ ల ద్వారా ప్రఖ్యాత వైద్య విద్య సంస్థలను ఏర్పాటు చేశారు.. వీటిలోSGPGI లక్నో, స్విమ్స్ తిరుపతి ఉన్నాయి..అని మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్య మంత్రి సంస్థ ప్రెసిడెంట్ మరియు యూనివర్సిటీ ఛాన్సలర్ కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలో సంస్థ విద్య Ê వైద్యంలో త్వరిత గతిన పురోగతి సంధించవచ్చు అన్నారు.
టిమ్స్ (తెలంగాణ ఇంస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్) హైదరాబాద్ నగరానికి నలుమూలల ఏర్పాటు
1,000 పడకల సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి
ఏయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థ
స్పెషలిటీ & సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు
స్పెషలిటీ & సూపర్ స్పెషలిటీ లలో వైద్య విద్య
16 స్పెషలిటీ & 15 సూపర్ స్పెషలిటీ లలో పీజీ కోర్స్ లు
సూపర్ స్పెషలిటీ లలో నర్సింగ్ & పారామెడికల్ విద్య
30 డిపార్ట్మెంట్ లు
గుండె, కిడ్నీ, లివర్, మెదడు,ఊపిరితిత్తుల విభాగాలు
కాన్సర్ సేవలు, ట్రామా సేవలు, ఎడ్నోక్రైనాలజీ విభాగాలు
ఎలర్జీ, రుమాటాలజీ విభాగాలు
వ్యాధి నిర్ధారణ విభాగాలు
200 మంది ఫాకల్టీ & 500 మంది వరకు రెసిడెంట్ డాక్టర్లు
26 ఆపరేషన్ థియేటర్స్
గుండె క్యాత్ ల్యాబ్ సేవలు & కిడ్నీ డయాలిసిస్ సేవలు
కాన్సర్ రేడియేషన్ & కిమోథెరపీ సేవలు
సిటీ స్కాన్ , MRI సేవలు
1,000పడకలకు ఆక్సిజన్ వీటిలో 300 ఐసీయూ పడకలు
రెసిడెంట్ లకు క్వార్టర్స్