సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ఈ నెల 6 వ తేదీన సిద్దిపేట రంగనాయక సాగర్ వేదిక గా జరిగే హాఫ్ మారథాన్ కు అపూర్వ స్పందన వస్తుంది.. సిద్దిపేట ప్రాంతనే కాకుండా హైదరాబాద్ లాంటి నగరాల నుండి హాఫ్ మారథాన్ కు అసక్తి చూపుతున్నారు.. నిన్న శ్రీకాంత్ అనే యువకుడు సికింద్రాబాద్ నుండి రన్నింగ్ చేస్తూ స్పూర్తిగా నిలిచారు..నేడు హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ వైద్యురాలు డా. నాగలక్ష్మి అదే బాటలో హైదరాబాద్ నుండి సైక్లింగ్ చేస్తూ సిద్దిపేట లో జరిగే హాఫ్ మారథాన్ కు మద్దతు పలికింది..56 ఏళ్ల నాగ లక్ష్మి సైక్లింగ్ చేస్తూ రావడం పట్ల మంత్రి హరీష్ రావు అభినందించారు.. 56 ఏళ్ళ వయస్సు లో కూడా సైకిల్ తొక్కడం నేటి తరానికి ఎంతో స్పూర్తిగా నిలిచిందన్నారు.డా.నాగ లక్ష్మి హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ వైద్యురాలు కాబట్టి హాఫ్ మారథాన్ లాంటి కార్యక్రమం సైక్లింగ్ , రన్నింగ్ మన ఆరోగ్యంకు ఎంతో ముఖ్యం అని నేడు తాను సైకిల్ తొక్కుతూ రావడం స్పూర్తిగా నిలిచిందన్నారు..ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరు హాఫ్ మారథాన్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.