- జనసేనపై మంత్రి రోజా విమర్శలు
- రోజా వ్యాఖ్యలను ఖండించిన పోతినేని
అమరావతి, అక్టోబర్ 17 : జనసేన నేతలు తనపై దాడి చేశారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మంత్రి రోజా విశాఖ ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కూడా అంతే వేగంగా వైసీపీ సేవలో తరిస్తున్నట్లుగా జనసేన నేతలపై కేసులు కూడా పెట్టారు. కానీ అసలు విమానాశ్రయంలో ఏం జరిగింది? జనసేన శ్రేణులను ఎవరు రెచ్చగొట్టారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. విశాఖ ఎయిర్ పోర్టులో జనసేన శ్రేణులకు మంత్రి రోజా వేలు చూపుతూ రెచ్చగొట్టిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. శనివారం విశాఖ విమానాశ్రయంలో మంత్రి రోజాపై హత్యాయత్నం జరిగిందని, ఒక సీఐ, ఎస్‌ఐపై దాడి చేశారని ఫిర్యాదు అందిందంటూ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
రోజాను హత్య చేయాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ సూచనలతోనే జనసేన కార్యకర్తలు రోజా కారును అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడి చేశారంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. మంత్రి విమానాశ్రయానికి వచ్చే సమయానికి పవన్ అక్కడికి రాలేదని, ఆయనను అరెస్టు చేయించాలనే దురుద్దేశంతోనే అలా కేసు పెట్టారని జనసేన నేతలు చెబుతున్నారు. ఇదిలావుంటే మంత్రి రోజా పై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ప్యాకేజి తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, మరి క్రూజ్ శంఖుస్థాపన జరిగిన నాలుగు రోజుల తరువాత మంత్రి రోజాకు బెంజ్ కారు ఎలా వచ్చిందన్నారు.
100 శాతం బెంజికారు మంత్రికి గిప్టేనని అన్నారు. జబర్దస్త్ డబ్బులతో రోజా బెంజ్ కారు కొన్నారా? అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు ఎవరిపైనా దాడి చేయలేదని, మంత్రి రోజా రెచ్చగొడుతూ ప్రవర్తించారని ఆరోపించారు. ఆ సమయంలో రోజా చేతి గాజు గీసుకొని పక్కన ఉన్న వ్యక్తికి గాయమైందేమోనని పోతిన మహేష్ అన్నారు.