జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 400వ రోజుకు చేరుకున్నాయని గ్రామ సాధన సమితి సభ్యులు అన్నారు.ఈ సందర్భంగా తిగుల్ మండల సాధన సమితి ఆద్వర్యంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తీగుల్ సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ తిగుల్ దీక్ష శిబిరంలో పలువురిని దీక్షకు కూర్చోబెట్టిమాని అన్నారు. తిగుల్ ను మండల కేంద్రంగా ప్రకటించే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. మండల కేంద్రానికి కావలసిన వసతులు భవనాలు అనుకూలంగా తిగుల్ లో ఉన్నాయని అన్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోపు తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కప్పర భానుప్రకాశ్ రావు,ఎంపిటీసి మంజుల మహేందర్ రెడ్డి,సిపిఐ కార్యదర్శి తోందురు నర్సింహా రెడ్డి రెడ్డి సంగం అధ్యక్షులు శ్రీరాం రెడ్డి సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, వీరెల్లి సత్తి రెడ్డి బిఎస్ పి నాయకులు జొడుముంతల నవీన్ యువజన నాయకులు మహేందర్ రెడ్డి చంద్రం సాయికుమార్ రెడ్డి,జాగృతి జిల్లా ప్రచార కార్యదర్శి నితీష్ రెడ్డి గ్రామస్తులు మండల సాధన సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.