నేడు ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం
1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరిగిన అనంతరం కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోకసభ స్థానలలో విజయం సాధించింది. ఇందిరా గాంధీ వ్యూహాత్మక చర్యల ఫలితంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల క్రమంలో తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ లో విలీనం అయింది. అలా విద్యార్థుల భాగస్వామ్యంతో ఉధృతంగా లేచిన తెలంగాణ ఉద్యమం నీరు కారి పోయింది.
తర్వాత 2001, ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు.
2009 నవంబర్ 29న ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచి, ఢిల్లీ పాలకుల చేత రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు మూలమైన నేపథ్యం, నివేదిక కూడా ఇచ్చాయి.
స్వరాష్ట్రం కోసం 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణ త్యాగం చేసిన తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వివిధ రూపాల ఉద్యమాలను రూపొందించారు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పుకోదగినవి. చివరికి కేసీఆర్ దీక్ష ప్రారంభించిన 12 రోజులకు.. సరిగ్గా డిసెంబర్ 9.. 2009న కేంద్రం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారం భమైం దని అధికా రికంగా ప్రకటిం చింది. ఈ నిర్ణయంపై సీమాం ధ్ర ప్రాంతంలో నిరస నలు మిన్నంటి సమైక్యాంధ్ర ఉద్యమము ఏర్పాటుకు పరిస్థి తులు దారితీసాయి.
2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయ కత్వం ‘‘ఐక్య కార్యాచరణ సమితి’’ ద్వారా వివిధ రూపాలలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటిని నియమించగా ఆ కమిటి 6 ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. యూపీఏ భేటీలో చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, ఆర్‌ఎల్డీ నేత అజిత్‌సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరుక్ అబ్దుల్లా, ముస్లిం లీగ్ నేత ఇ. అహ్మద్ తదితరులు కాంగ్రెస్ తీర్మానానికి మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ సుమారు 60 ఏళ్లుగా కొనసాగుతున్న అంశాన్ని సమావేశంలో ప్రస్తావిస్తూ, హైదరా బాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ నిర్ణయాని కనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
తెలంగాణను పది జిల్లాలతో హైదరాబాద్‌తో కూడిన రాష్ట్రాన్నే ఏర్పాటు చేస్తామని, పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఈలోగా సీమాంధ్రలో ఎక్కడ అనుకూలంగా ఉంటుందో చూసి అక్కడే నూతన రాజధానిని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుందన్నారు. సమస్యలు పరిష్కరించు కునేందుకు గాను క్యాబినెట్ సబ్ కమిటీ కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఏర్పాటు చేస్తుందని తీర్మానించారు. యూపీఏ, సిడబ్ల్యూసిల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని కేంద్రానికి పంపిస్తామని, కేబినెట్ కమిటీ రూపొం దించిన అంశాలను న్యాయశాఖకు పంపి స్తారని, ఆ తర్వాత బిల్లు రూపొందు తుందని, ఆ బిల్లును క్యాబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తామని పేర్కొన్నారు. 2013 జూలై 31 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో, సమైక్యాంధ్ర ఉద్యమం మరల రగిలింది. నాటి కాంగ్రెస్ ఎంపీలు ఎంపీలు గుత్తా సుఖేందంరెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాజయ్య, డాక్టర్ వివేక్ తదితరులు, పాలమెంటు సమావేశాల్లో సోనియా గాంధీ సమక్షంలోనే తీవ్ర ఆందోళనలు చేశారు.
2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2 న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. కేసిఆర్ నేతృత్వంలోని తెరాస తొలి మలి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తున్నది.
– రామ కిష్టయ్య సంగనభట్ల…
9440595494