దండకారణ్య కథలు-3

దండకారణ్య కథలు  45సంవత్సరాలుగా దోపిడి వ్యవస్థలో జరుగుతున్న విప్లవోద్యమ పోరాటాలను సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు.. ఇలాంటి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం..

నేను ఈ మధ్య అల్లం రాజయ్య  సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఇందులో మూడు భాగాలుగా కథలు రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణ తారలు అచ్చైనటువంటివి.. మొదటి కథల సంపుటి 2005 2012 -16 కథలతో మొదటి సంఖ్యలను తీశారు. 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం తెచ్చింది. ఇప్పుడు 2016 -2019 మొత్తం14 కథలతో మూడవ కథల సంకలనం తెచ్చింది.. ఈ కథలలో గత 50 సంవత్సరాలుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా మరింత అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

ఇందులో మొత్తము 14 కథలు ఉన్నాయి ప్రతి కథ అనుభవం నుంచి వ్యక్తం అవుతున్నాయి. సీతా బాయ్ గెలుపు అనే కథలో సన్నాఫ్ సీతాబాయి ప్రధానపాత్రలుగా నడుస్తుంది సన్నావు ఆ ఊరిలో ప్రజలందరి సమస్యలు పరిష్కరించడం ముందుంటాడు. అంతేకాకుండా గ్రామంలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టడం గురించి ప్రజల చైతన్యవంతం చేస్తూ తిరుగుబాటు లేవనేత్తుతాడు.. తానేదారు సన్నావును అరెస్టు చేసి తర్వాత ఏం చేశాడన్న…విషాదం ఈ కథలో ఆధ్యాంతం దుఃఖపు చాయలు అలముకుంటాయి. తొలి సంధ్య కథ దీన్ని వినోద అద్భుతంగా మలిచారు. తులా రామ్ కుటుంబం  అడవిలో నివసిస్తుండగా అక్కడ సహజవనరులను దోచుకోవాలని ఉద్దేశంతో ఆ గ్రామం నుండి వలస పెట్టుబడిదారులు గుండాయిజంతో దుర్మార్గంగా తరలించి వేస్తే చివరగా అడవులలో వారు పడే పాట్లు అతడి మరణం, తర్వాత వాళ్ళ కుటుంబం ఎదురుకున్న కష్టాలు అన్నీ కూడా ఈ కథలో మనకు యామిని  కళ్ళ ముందు ఆవిష్కరించారు. తెగింపు ఈ కథలో సుఖం ఆమె భర్త ఫుల్ సింగ్ ఇద్దరు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతున్న క్రమంలో పోలీసులు ఎత్తుగడలతో ఫుల్ సీను ఎన్కౌంటర్లో చంపేస్తారు. దాంతో సుక్కో కూడా తన కుమారుడిని అత్తమామలకు అప్పగించి దళంలో చేరడంతో కథ ముగుస్తుంది, పోలీసులు వేసే ఎత్తుగడలు తప్పించుకున్న తీర్లు అడవితల్లి వారిని కాపాడిన విధానము అన్నీ కూడా కథలో మనకు కనిపిస్తాయి.. ధిక్కారం ఈ కథను ఆసిఫా  మహిళలలో లౌకికంగా కనిపించే బలహీనతను తోసిపుచ్చి మహిళలలో ఉండే చైతన్యాన్ని ధిక్కార స్వరాన్ని ఈ కథలో చూపించారు. ఊరి మీద పడ్డ పోలీసులు పసిబిడ్డల తల్లులను పట్టుకుపోతుంటే వారు ఏ విధంగా ప్రతిఘటించారు అనేటువంటి విషయాన్ని సున్నితంగా కథలో వ్యక్తం చేశారు..

అమ్మ పాలు ఆయుదాలైన వేళ ఈ కథలో ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్లను రక్షించడంలో ఆడవాళ్లు ,వాళ్ళు పడుతున్నటువంటి పాట్లు ముఖ్యంగా పసిపిల్లలను కన్న తల్లులు వారి పాలధారలతో ఏ విధంగా దళాలను రక్షించాలన్నటువంటి విషయాన్ని మనo ఈ కథలో చూడొచ్చు. శిక్ష అనే కథను యామిని కొత్త అనుభవరీతిగా ఆవిష్కరించారు. ఇందులో దళంలో చేరినటువంటి కొంతమంది పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారితే ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రచించారు.. విప్లవంలో ఒక తల్లి తండ్రి ఈ కథలో పోలీస్ కాల్పులలో దళంలో కొత్తగా చేరిన తన బిడ్డ కాల్పుల సమయంలో ఆందోళన తోటి భయంతో తుపాకిని మరిచి రావడం అలా రావడం తప్పు బిడ్డ అని తల్లిదండ్రులు ఆ కూతురుకు ధైర్యం చెప్పడం అనేటువంటి కొత్త కోణాన్ని ఈ కథ ద్వారా ఆవిష్కరించారు ఆసిఫా …. పీలు ఈ కథలో పిల్లవాడి నుండి తన తండ్రి మరణం దాకా పిలువ అనే పసిపిల్లవాడు ఉద్యమంలోనే పార్టీలోనే అన్ని చూసి నేర్చుకుంటాడు. తన తండ్రి చావుకు కారణమైన వి…. తన తండ్రి చేతుల్లో ఉన్న ఆయుధం ఉన్నప్పటికీ ఎలా మరణించాడు అమ్మ అని తల్లిని ప్రశ్నించడం ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన అర్థం చేసుకునే వయసు పిలుకు లేదు చివరగా పిలు తన తండ్రి మార్గాన్ని అనుసరించడంతో ఈ కథ ముగుస్తుంది.. విప్లవ తరం ఈ కథలో పార్టీలోకి చేరినటువంటి కొన్ని కుటుంబాలు తమ బిడ్డలను వివాహం చేసుకోమని ఒత్తిడి చేయడము ఆ తర్వాత వారిలో సంభవించినటువంటి మార్పు పార్టీలో చేరిన తర్వాత అక్కడ జీవించే విధానము పద్ధతులు పెండ్లికి అక్కడ వాళ్ళు వాడే సహచరులపదము కొత్తగా అనిపిస్తాయి..

సహచరులు అనే ఖాతాను తాయమ్మ కరుణ  రచించారు.. ఇందులో దీప అనిల్ ఇద్దరు కూడా చిన్నప్పటినుండి ఒకే చోట పెరగడము ఒకే రకమైన ఆలోచన విధానం ఉండటం తర్వాత దళంలో చేరిన తర్వాత కూడా సహచరులుగా ఎలా కాలాన్ని ఎదుర్కొన్నారు అనేది ఈ కథలో కనపడుతుంది. నూతన మానవుడు ఈ కథ కూడా చాలా సృజనాత్మకంగా ఆవిష్కరింపబడింది .ఇందులో మమత సంజీవదేవ్ అనే ఇద్దరి వ్యక్తుల ప్రధాన పాత్రలుగా వారి ప్రేమ వారి ఆప్యాయత పార్టీలో వారు చేసినటువంటి సేవలు వారి కర్తవ్యనిష్ట అనేక అంశాలు ఇందులో మనకు తడమబడ్డాయి. మౌఖిక చరిత్రకారులు ఈ కథ పార్టీలో కొంతమంది ఉపాధ్యాయ వృత్తి నేర్చుకొని పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు తర్వాత కొత్త క్యాడర్ నియమించుకోవడం వారికి బోధించడం పట్ల చైతన్యవంతమైనటువంటి స్పృహ కలిగించడంతో ఈ కథ నడుస్తుంది.. అమూల్యం కథలో తన కొడుకును దళంలో చేర్పించిన తండ్రికి కొడుకు ప్రవర్తన ద్వారా పార్టీ నుండి వెలివేయబడటం దానికి దుఃఖించి వయసు మళ్ళినప్పటికీ తాను దళంలో చేరాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందో అన్నీ కూడా మనకు ఈ కథలో.. చివరి కథ కామ్రేడ్ కొజ్జా ఉత్తరం ఈ కథలో పార్టీలో ఉండేటువంటి కొంతమంది తమ కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాయడంలో ఎదుర్కొనే భాషా సమస్య.. అక్కడి వారి సహచర్యం చివరగా వాళ్ళు ఎలా కుటుంబ సభ్యులతో ఉత్తరాలు రాసారు అనేటువంటిది కథలో తెలుస్తుంది.. మొత్తం మీద దండకారణ్య కథలు  45సంవత్సరాలుగా దోపిడి వ్యవస్థలో జరుగుతున్న విప్లవోద్యమ పోరాటాలను సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు.. ఇలాంటి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం..

-నాగరాజు మద్దెల

6301993211.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page