ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 17: పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్పెట్ దుద్యాల కొత్తపల్లి మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.కొడంగల్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని బీఆర్ ఎస్ ప్రభుత్వం కొడంగల్ ప్రాంత ప్రజలను మోసం చేసిందనీ అన్నారునారాయణపేట్-కొడంగల్ ఎత్తి పోతల పతకాన్ని పడావు పెట్టి కొడంగల్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారనీ ఉన్నారు ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ తేలేదని పేదలకు ఇండ్లు ఇవ్వలేదు కానీ కేసీఆర్ 150 గదులతో పెద్ద గడీని కట్టుకుండనీ ఏద్దేవా చేశారుపదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు ఇందిరమ్మ రాజ్యంలో పేదలను ఆదుకుంటామని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు దుద్యాల అభివృద్ధి మా హయాంలో జరిగిందనీ 2018లో దుద్యాలను మండల కేంద్రంగా చేస్తామని ఆనాడే నేను మాట ఇచ్చానని ఇవాళ దుద్యాల మండల కేంద్రం అయిందనీ కానీ.. మండల కేంద్రంలో ఉండాల్సిన పోలీస్ స్టేషన్, జూనియర్ కాలేజీ, ఏ ఆఫీసులు ఇక్కడ లేవనీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారుకేవలం పేరుకు మాత్రమే మండల కేంద్రం చేసి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుందనీ అన్నారు కాంగ్రెస్ గేలిస్తేనే దుద్యాల అభివృద్ధి చెందుతుందనీ పదేళ్లుగా ఈ ప్రాంతానికి ఏమీ చేయని బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తున్నారనీ అందుకే కారు గుర్తును బొందపెట్టాలనీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలనీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతోపాటు తులం బంగారం అందిస్తామని కేసీఆర్ ఉంటే పెన్షన్ రూ.2వేలే.. కేసీఆర్ ను బొందపెడితే.. పెన్షన్ రూ.4వేలనీ అన్నారు ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమమని కేసీఆర్ కు పదేళ్లు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండనీ కోరారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.