దేశ సంపాదనలో 30 శాతం చిన్న పరిశ్రమలదే

  • అత్యుత్తమ ఎంఎస్‌ఎంఇలకు అవార్డస్ అం‌దించిన ప్రధాని మోడీ
  • ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇం‌టర్నెట్‌
  • ‌బెంగుళూరు బాష్‌ ఇం‌డియా స్మార్ట్ ‌కేంపస్‌ను ప్రారంభించిన మోదీ

న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దేశ సంపాదనలో 30 శాతం ఎంఎస్‌ఎంఇల నుంచే వొస్త్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ పనితీరు కనబరచిన ఎంఎస్‌ఎంఇకు ఆయన అవార్డస్ అం‌దించారు. ఎంఎస్‌ఎంఇ ‌రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం దృష్టి పెట్టిందని..వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం దేశానికి మూడు పిల్లర్స్ ‌లాంటివన్నారు ప్రధాని. 18 వేల ఎంఎస్‌ఎంఇలకు 500 కోట్లకు పైగా డిజిటల్‌గా బదిలీ చేయబడ్డాయని తెలిపారు. 200 కోట్ల వరకు ఆర్డర్స్‌ను..గ్లోబల్‌ ‌టెండర్లు పిలవొద్దని.. స్థానికులకే చెందేలా తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. జెమ్‌ ‌పోర్టల్‌లో ప్రతీ ఒక్కరూ రిజిస్టర్‌ ‌చేసుకోవాలని కోరారు. గురువారం దిల్లీ విజ్ఞాన్‌ ‌భవన్‌లో ర్యాంప్‌ ‌స్కీమ్‌తో పాటు.. ఎంఎస్‌ఎంఇ ఎక్స్ ‌పోర్టస్ ‌సామర్థ్యం పెంపు, పీఎం ఎంప్లాయిమెంట్‌ ‌జనరేషన్‌ ‌పోగ్రామ్‌ ‌కొత్త ఫీచర్స్‌ను మోడీ ప్రారంభించారు.

ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇం‌టర్నెట్‌ : ‌బాష్‌ ఇం‌డియా స్మార్ట్ ‌కేంపస్‌ను ప్రారంభించిన మోదీ
దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇం‌టర్నెట్‌ను అందజేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డిజిటల్‌, ‌టెక్నాలజీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒకటి అని చెప్పారు. బాష్‌ ఇం‌డియా స్మార్ట్ ‌కేంపస్‌ను మోదీ గురువారం వీడియో మెసేజ్‌ ‌ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది టెక్నాలజీ శకమని తెలిపారు. కోవిడ్‌-19 ‌మహమ్మారి సమయంలో టెక్నాలజీ వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రస్తావించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ ‌రంగాల్లో మరిన్ని పెట్టుబడులు రావాలన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని తెలిపారు. గడచిన రెండేళ్ళలో పెట్టుబడులు పుంజుకున్నాయని తెలిపారు. మన దేశ యువత వల్ల మన స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ ‌ప్రపంచంలో అతి పెద్దవాటిల్లో ఒకటిగా ఉందని చెప్పారు. టెక్నాలజీ ప్రపంచంలోనే అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి గ్రామానికీ హైస్పీడ్‌ ఇం‌టర్నెట్‌ ‌సేవలను అందజేయాలని భారత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

డిజిటల్‌ ఇం‌డియా స్వప్నంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడం కూడా ఉందని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, పెట్టుబడులు పెట్టాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. మన దేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆ కంపెనీని అభినందించారు. భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఈ కంపెనీ ఓ ప్రత్యేకతకు సంబంధించిన ఉత్సవాలను జరుపుకుంటోందన్నారు. భవిష్యత్తు అవసరాలకు తగిన ఉత్పత్తులు, పరిష్కారాల అభివృద్ధి కోసం ఈ నూతన స్మార్ట్ ‌కేంపస్‌ ‌నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. తాను జర్మన్‌ ‌ఛాన్సలర్‌ ఏం‌జెలా మెర్కెల్‌ ‌తో కలిసి 2015లో ఈ కంపెనీని సందర్శించానని గుర్తు చేశారు. సౌర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం గడచిన ఎనిమిదేళ్ళలో దాదాపు 20 రెట్లు పెరిగిందని, దీంతో భారత దేశ అభివృద్ధి పర్యావరణ హితకరంగా జరుగుతోందని చెప్పారు.

భారత దేశంతోపాటు ఇతర దేశాల్లో కూడా కార్బన్‌ ‌నూట్రాలిటీని సాధించినందుకు ప్రశంసించారు. భారత దేశంలో రానున్న 25 ఏళ్ళలో ఏం చేయగలమో నిర్ణయించుకుని, లక్ష్యాలను ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు. వందేళ్ళ క్రితం ఈ కంపెనీ ఓ జర్మన్‌ ‌కంపెనీగా భారత దేశానికి వచ్చిందని, ఇప్పుడు దానికి ఎంత జర్మన్‌ ‌స్వభావం ఉందో, అంత భారతీయత ఉందన్నారు. జర్మన్‌ ఇం‌జినీరింగ్‌, ఇం‌డియన్‌ ఎనర్జీకి ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు. ఈ భాగస్వామ్యం మరింత బలపడాలని చెప్పారు. ఇదిలా వుండగా, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ఆఫ్‌ ‌థింగ్స్ ‌కార్యకలాపాలను విస్తరిస్తామని బాష్‌ ఇం‌డియా ప్రకటించింది. కేంపస్‌ అభివృద్ధి కోసం గడచిన ఐదేళ్ళలో రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page