రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
వికారాబాద్ జిల్లా తాండూరులో 50 కోట్లతో
పలు అభివృద్ధి ప్రారంభించిన మంత్రి
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నూత నంగా అమలు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కన్నీరు హరీష్ రావు అన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో 50 కోట్లతో చేపట్టినకార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేశారు. సమాచార పౌర సంబంధాలు, గనులు భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదరపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తాండూర్ లో 25 కోట్లతో నిర్మించునున్న నర్సింగ్ కాలేజ్ భూమి పూజ, 10.23 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన, 10 కోట్లతో నూతన మార్కెట్ యార్డ్ కు భూమి పూజ, తాండూర్ లో 1.50 లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవన కి భూమి పూజ, తాండూరు లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం, తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో కోటి 50 లక్షలతో నిర్మించిన దుకాణాల సముదాయం, పేషంట్ అటెండెన్స్ వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని విలేము పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన ప్రగతి ప్రస్థాన సభ సమావేశంలో అభివృద్ధి సంక్షేమం టిఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు తాండూర్ నియోజకవర్గ పరిధిలోని కోటిపల్లి ప్రాజెక్టుకు త్వరలో రూపాయలు 40 కోట్ల నిధులతో పునర్నిర్మాణ పనులు చేపడతామని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలోని నియోజ• •వర్గాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.
తాండూర్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో 300 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులను తీసుకురావడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వికారాబాద్ జిల్లాను కోటిపల్లి మండలాలను తాండూర్ ను రెవెన్యూ డివిజన్ గా సాధించుకున్నామని పేర్కొన్నారు 500 జనాభా గల ప్రతి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా మార్చిన ఘనత టిఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. జిల్లా మంత్రిగా తాండూర్ అభివృద్ధి కోసం అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాలను గెలిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ల కలయిక తో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు తాండూర్ లో డిపాజిట్ గల్లంతేనని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి పతంలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశంలో అందరికీ ఆదర్శమని అన్నారు. నేడు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లకు అభ్యర్థులు కరువయ్యారని ముఖ్యమంత్రి థీమా చేశారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని తాండూరులో రోహిత్ రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల హరీష్ రావు మహేందర్ రెడ్డి ల సహకారంతో తాండూరు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచామని ఇంకా అభివృద్ధి పరుస్తామని అన్నారు. అత్యధికంగా తాండూరులో 50 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని అన్నారు జిల్లా ఆస్పత్రిని అప్ గ్రేడ్
అప్గ చేసిన ఘనత మంత్రి హరీష్ అన్నదేనని అన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. దేశం కెసిఆర్ పాలన కావాలని కోరుకుంటున్నాను అన్నారు. దేశంలో ఎక్కడా లేని వధంగా రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుందని అన్నారు.
పేదలకు పెన్షన్ విషయంలో రాష్ట్రం అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు 75% డెలివర్లు ప్రభుత్వ ఆసుపత్రిలోని జరుగుతున్నాయని ఆడపిల్లల పేర్లకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో దేశంలో బిజెపి కాంగ్రెస్ గెలిచేది లేదు అన్నారు మరో మరో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేను ఎన్నికల్లో మరో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో తాండూరు ఆర్డీవో శ్రీనివాసరావు, వికారాబాద్ జిల్లా శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ చైర్మన్ స్వప్న వైస్ చైర్మన్ దీపా నర్సింలు మార్కెట్ కమిటీ చైర్మన్ వీణ, వైస్ చైర్మన్, మండల ఎంపీపీలు ,వివిధ మండలాల అధ్యక్షులు జడ్పిటిసి లో ఎంపిటిసిలు సర్పంచులు, కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.