దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌

  • టీ హబ్‌ 2‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • ‌మాదాపూర్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం
  • రు.400 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
  • 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాలు
  • 2 వేల స్టార్టప్‌లకు వసతి అవకాశాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌ ‌టీ హబ్‌ 2‌ను సీఎం కేసీఆర్‌ ‌మంగళవారం ప్రారంభించారు. మాదాపూర్‌లో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఐటి రంగంలో ఇదో అద్భుతమైన కట్టడంగా నిలిచిపోనుంది. వరల్డ్ ‌లార్జెస్ట్ ఇన్నోవేషన్‌ ‌క్యాంపస్‌ అయిన టీ హబ్‌ 2‌ను ప్రభుత్వం రూ.400 కోట్ల పెట్టుబడితో 3ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. ఇందులో ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశముంది. శాండ్‌విచ్‌ ఆకారంలో కనిపిస్తూ.. అట్రాక్ట్ ‌చేసేలా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణంలో.. ప్రతీది ఓ అద్భుతంగా కనిపిస్తుంది. స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించేలా 2015లో టీ హబ్‌ను రాష్ట్ర సర్కార్‌ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దానికి అనుబంధంగా సెకండ్‌ ‌ఫేజ్‌ను తీసుకొచ్చింది.

ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్‌  ‌ఫస్ట్ ‌ఫేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి మంచి రెస్పాన్స్ ‌రావడం, విజయవంతమైందని సర్కార్‌ ‌భావించడంతో భారీగా ఇప్పుడు టీ-హబ్‌  ‌సెకండ్‌ ‌ఫేజ్‌ ‌ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. 400 కోట్ల రూపాయల ఖర్చుతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ-హబ్‌  ‌రెండో దశలో ఏకకాలంలో 4 వేల స్టార్టప్‌ ‌లకు అవసరమైన వసతి కల్పించవచ్చని అధికారులు అంటున్నారు. తొలిదశతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దదైన రెండోదశ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా అవుతుందని చెబుతు న్నారు. మొదటిదశలో ప్రాథమిక స్థాయి వసతులు అందుబాటులో ఉండగా.. తాజా రెండో దశలో అత్యాధునిక వసతులు కల్పించారు. పది అంతస్తుల్లో టీ-హబ్‌  ‌రెండో దశ నిర్మాణం కాగా..

ప్రస్తుతానికి ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇందులో ఆఫీసులు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్‌ ‌క్యాపిటలిస్టులు, స్టార్టప్‌లు, ఇతర సంస్థలను నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది. స్టార్టప్‌  ‌సంస్కృతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్‌, ‌కరీంనగర్‌, ‌ఖమ్మం, నిజామాబాద్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌ ‌లో టీ-హబ్‌  ‌రీజినల్‌  ‌సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. టీ హబ్‌ ‌నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు. ఈ క్యాంపస్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్‌, ఎం‌పీ రంజిత్‌ ‌రెడ్డి, చీఫ్‌ ‌సెక్రటరీ సోమేశ్‌ ‌కుమార్‌, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ జయేష్‌ ‌రంజన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు మరో ఆణిముత్యం…టి హబ్‌కు రతన్‌ ‌టాటా సహా పటువురు ప్రముఖుల ప్రశంసలు
టీహబ్‌2.0 ‌ప్రారంభోత్సవం సందర్భంగా దేశవిదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్‌ ‌వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశ స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌కు టీ హబ్‌ 2.0 ‌గొప్ప వరమని కితాబిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ ‌క్యాంపస్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త టీ-హబ్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అభినందనలు. భారత స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు ఇది గొప్ప ఊతమిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ ‌టాటా అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ ‌క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన కేటీఆర్‌కు అభినందనలు.

టీహబ్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. ఆల్‌ ‌ది వెరీ బెస్ట్ అని  సాప్‌ ‌ల్యాబ్స్ ఇం‌డియా ఎండీ, సింధు గంగాధరన్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌ ‌దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రం, నగరంగా మారుతున్నాయని అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలకు హైదరాబాద్‌ ‌విశ్వకేంద్రం మారాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page