నిరుద్యోగులకు శుభవార్త 30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

  • 30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి
  • శాఖల వారీగా జీఓ లు విడుదల

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఈమేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ 80039 ఉద్యోగ ఖాలీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా 80 వేల 039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది.

ఈ మేరకు అనుమతులు ఇస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాలీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page