ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 18: శంకర్పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమన్నకు గజమాలతో స్వాగతం పలికారు.నియోజకవర్గంలోని ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను పామేనా భీం భరత్ కోరినారు.ప్రతిపక్ష నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని విన్నవించుకున్నారు. నియోజకవర్గంలో వందల ఎకరాల భూములు నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనత నాదన్నారు. శంకర్పల్లి మండలంలోని శేరిగూడ, కొండకల్, కొండకల్ తండా, మోకిలా తండా,మోకిలా గ్రామాలలో ప్రచారంలో భాగంగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా భీమన్న మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రజల సమస్యలు తీర్చలేదన్నారు. నియోజకవర్గంలో సమస్యలు విలయ తాండవం చేస్తుంన్నాయన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజల జీవన విధానానికి అనుకూలంగా నిత్యవసర సరుకుల ధరలను అందుబాటులో ఉంచిందన్నారు.కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను అమలు చేస్తామని భీమ్ భరత్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ప్రజలు గమనించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.