కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు అబద్దం..
లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదు
ఈ ప్రాజెక్ట్ నిర్వహణ, విద్యుత్ బిల్ కు ఏటా 25 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం.
2020 లోనే మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం
ఇరిగేషన్ అధికారులు ఎల్ అండ్ టి లేఖ . .అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
మేడిగడ్డ, అన్నారం , సుందిల్ల బ్యారేజి లు మూడు ఒకే టెక్నాలజీ, నైపుణ్యం తో నిర్మించారు-రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ( ఫిబ్రవరి 13) :కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించామని గత ప్రభుత్వం చెబుతున్న మాటలు అంత అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సందర్శించారు. ఉదయం హైదరాబాదు నుండి బస్సులలో బయలుదేరిన బృందం సభ్యులు సుమారు మూడు గంటల సమయంలో మేడిగడ్డకు. చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 19 ,20, 21 కుగిన పిల్లర్లను వారు పరిశీలించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్వహణకు ప్రతి ఏటా 25 వేల కోట్లు ఖర్చు అవుతాయని అన్నారు.
2020 లోనే మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని అధికారులు ఎల్తికి లేఖలు రాసిన పట్టించుకోలేదని ఆరోపించారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు ఒకే నమూనాలు ఒకే నాణ్యతతో నిర్మించారని వీటికి రానున్న రోజులలో మనుగడ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఓకే విధమైన సమస్యలు ఈ మూడింటిలో ఉత్పన్నం అవుతున్నాయని,ఈ సమస్యను కప్పిపుచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు నీటిని తొలగించారని ఆరోపించారు.నీరు పూర్తి సామర్థ్యం మేరకు నింపితే లోపాలు బయట పడతాయని,.ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నుండి ఏటా 180 టీఎంసీ ల నీటిని ఎత్తి పోయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికీ ఒక్క సంవత్సరం కూడా ప్రతిపాదిత లక్ష్యం చేరుకోలేదని అన్నారు. 2020 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అధికారులు లోపాలు ఉన్నట్లు ఎల్ అండ్ టి కి నోటీస్ లు జారీ చేశారని,ఇప్పుడు గత ప్రభుత్వ బాధ్యులు, ఎల్ అండ్ టీ బ్యారేజి కుంగుబాటుకు మా బాధ్యత లేదని చెబుతున్నాయని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణాలు, నిర్వహణలో లోపాలు ఉన్నాయని,కాగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దోపీడీ జరిగిందని చెప్పాయని వెల్లడించారు.కాగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దోపీడీ పై ఈ బడ్జెట్ లో చర్చ పెట్టాలని భావించామని, కృష్ణా నది పైన ప్రాజెక్ట్ లను కేఆర్ ఎంని ఇచ్చారనీ తమ ప్రభుత్వం ను బద్ నామ్ చేస్తున్నారని అన్నరు.అసెంబ్లీలో కే ఆర్ ఎం బి పై సలహాలు సూచనలు ఇవ్వమని ప్రతిపక్షం కు సూచించామని తెలిపారు.
అసెంబ్లీ లో తెలంగాణ ప్రజల మేలుకు ఏవిధమైన సూచనలు ప్రతి పక్షం చేసిన స్వాగతిస్తామని వెల్లడించారు.మేడిగడ్డ బ్యారేజి లో నీళ్ళు నింపితే పెను ప్రమాదం మంచి ఉందని,5 మీటర్ల మేరా బ్యారేజి కుంగి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు అసెంబ్లీ లో సాగునీటి రంగం పై శ్వేత పత్రం ప్రవేశ పెడతామని,ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ రేపటి అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని కోరారు. కవులు, కళాకారులు మేడిగడ్డ బ్యారేజి వచ్చి కుంగుబాటు ను పరిశీలించాలని పిలుపునిచ్చారు.