నేడు సిద్దిపేటలోజరిగే పరుగుల పండుగను  చూడడానికి వచ్చాను

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ యం. నాగలక్ష్మి,  మాట్లాడుతూ  ఉదయం 6 గంటలకు హైదరాబాదు నుండి 100కె సైక్లింగ్ చేసుకుంటూ బయలుదేరాను సిద్దిపేటలో నిర్వహించే హాఫ్ మారథాన్ కు సంఘీభావం తెలపడం గురించి సిద్దిపేటలో ఉన్న యువతి యువకులను ప్రోత్సహించడానికి  తన వంతు కృషిగా ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. పోలీస్ కమిషనర్  ప్రోత్సవంతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చన్నారు. యువత కోసం నిర్వహిస్తున్న ఈ రేపు సిద్దిపేట పట్టణంలో జరిగే  పరుగుల  పండుగలో ప్రతి ప్రజలు ప్రజాప్రతినిధులు  ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.రేపు హాఫ్ మారథాన్ లో  పాల్గొనే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిరోజు సైక్లింగ్ యోగా చేస్తూ ఉండడం జరుగుతుందన్నారు  రోజుకు 2 గంటల వ్యాయామం చేయడం జరుగుతుందన్నారు.  ప్రతిరోజు 20 లేదా 30 కిలోమీటర్ల సైక్లింగ్ చేయడం  హాబీగా పెట్టుకోవడం జరిగిందన్నారు. సెప్టెంబర్ నుండి 50k 100 k 200 కే సైక్లింగ్ చేయడం  జరుగుతుందన్నారు. ప్రకృతి ప్రసాదించిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు  హైదరాబాదులో 10 కోట్ల రూపాయలతో నేచర్ క్యూర్ హాస్పిటల్ ను ఆధునికరించడం జరిగిందని తెలిపారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే  ఈ హాస్పిటల్స్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. హాస్పిటల్ ప్రకృతి ప్రసాదించిన వరంగా  ఆహ్లాదకరంగా పచ్చతనం పరిశుభ్రతతో ఎంతో బాగుంటుందని తెలిపారు. మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు  చొరవతో  సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  అంగరంగ వైభవంగా నిర్వహించే హాఫ్ మారథాన్  పరుగుల పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page