నేను లోకల్ గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థి తుంకుంట నర్సారెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 20 : జగదేవపూర్ మండల పరిధిలో ని తిమ్మాపూర్, అనంతసాగర్, బస్వాపూర్, వట్టిపల్లి, మాదాపూర్ పలుగుగడ్డ, మునిగడప గ్రామల్లో గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థి తుంకుంట నర్సారెడ్డి ఇంటింటి ప్రచారం లో భాగంగా గ్రామలు తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లను గడప గడపకు వివరిస్తూన్నామని అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము ఏర్పడినక సీఎం కేసీఆర్ తన సొంత ఊరైన చింతామడక ప్రతి ఇంటికి పది లక్షలు రూపాయలు ఇంచాడు తప్పు గజ్వెల్ నియోజకవర్గం అయినా సొంత ఇలాక లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఇంత వరకు రెండు పడకల గదులు గాని, దళిత బంధు గాని బిసి బంధు కానీ ఇంత వరకు ఇవ్వలేదని అన్నారు.కానీ నేను లోకల్ మీ బిడ్డను, మీకు ఏ కష్టం వచ్చిన అందుబాటులో ఉంటానని అన్నారు. బీ ఆర్ యస్, బీజేపీ అభ్యర్థులు మళ్ళీ గెలిచినా మన సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని డిస్తుతి ఏర్పడినదని అన్నారు.కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు రైతులకు రెండు లక్షల ఋణ మాపి, ప్రతి నిరుపేదకు రెండు పడకల ఇండ్లు,24గంటల కరెంట్, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని అన్నారు. విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసి రెడ్డి రవీందర్ రెడ్డి, పాక్స్ మాజీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, ధర్మారం మల్లేశం, వట్టిపల్లి సర్పంచ్ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మున్నీర్, ఇటిక్యాల ఎంపీటీసీ అయ్యుమ్, లింగారెడ్డి పల్లి గ్రామ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page