న్యాయం చేయకపోతే బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తమ ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకపోతే త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వెయ్యి మంది సభ్యులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతామని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సువర్ణ రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డిలు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1983 రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం వట్టి నాగులపల్లి గ్రామంలోని 460 ఎకరాలలోని 3333 ప్లాట్లను కొనుగోలు చేసిన 3228 మంది ఓనర్స్ ని సైట్ మీదకు రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న జైహింద్ రెడ్డి, వైవి.సుబ్బారెడ్డి, మెగా కృష్ణారెడ్డిలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను ప్రభుత్వ పెద్దల అండతో వ్యవసాయ భూమిగా చిత్రీకరించి విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్లాట్ల వద్దకు వస్తే కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తక్షణమే స్పందించి తమ ప్లాట్లు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. తమకు జరిగిన అన్యాయంపై త్వరలో రాష్ట్ర గవర్నర్, ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు,  పెద్దఎత్తున ప్లాట్ ఓనర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page