పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: అతి చిన్న వయసులో వేలాదిమంది యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప నాయకుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అని పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు అన్నారు.పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 36వ జయంతి వేడుకలు పటాన్ చెరు లో జిఎంఆర్, జివిఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు, అమీన్ పూర్ పరిధిలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. పటాన్ చెరులో…
పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో జిఎంఆర్ యువసేన, జివిఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. సుమారు 200 మందికి పైగా జి.వి.ఆర్ స్నేహితులు, జిఎంఆర్ అభిమానులు రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వేలాదిమంది అభిమానులు, సన్నిహితుల సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. నిరుపేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. తండ్రికి తగ్గ తనయుడుగా ఎదుగుతున్న క్రమంలో మృతిచెందడం అత్యంత బాధాకరమన్నారు. విష్ణు ఆదర్శలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
రక్తదాన శిబిరాన్ని పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుంధర, బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ శ్రీలేఖ, ఆర్ఎంఓ ప్రవీణ, డాక్టర్ మల్లెల శ్రీనివాస్, డాక్టర్ సంగారెడ్డి లు పర్యవేక్షించారు.
నందిగామలో..
పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో జివిఆర్ ఫ్రెండ్స్, జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డిలు ప్రారంభించారు. 80 మందికి పైగా జిఎంఆర్ అభిమానులు రక్తదానం చేశారు.
వృద్ధాశ్రమంలో..
పటాన్ చెరు మండలం ఇండ్రేశం గ్రామ పరిధిలో గల వృద్ధాశ్రమంలో విష్ణు వర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించి, వృద్దులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదానం నిర్వహించారు.
అమీన్ పూర్ లో..
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని మహిమా మినిస్ట్రీస్ అనాథ ఆశ్రమంలో జి ఎం ఆర్ యువసేన ఆధ్వర్యంలో విష్ణు వర్ధన్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ లు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ గౌడ్, గూడెం సంతోష్ రెడ్డి, గూడెం సందీప్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, జి వి ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకులు మహేష్, దేవేందర్, దర్పల్ రెడ్డి, వినోద్ రెడ్డి, రాజు, శ్రీనివాస్ రెడ్డి, గాంధీ, గణేష్, సతీష్ రెడ్డి, యంజల్ సతీష్, నవీన్, బాల, నాగరాజు, భాను, రాము, కిట్టూ, గుర్రం మధుసూదన్ రెడ్డి, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.