పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదాం

  • మున్సిపాలిటీల రూపు మార్చాలి
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రీన్‌ ‌ఫండ్‌ ‌మున్సిపాలిటీల్లోనే ఖర్చు చేయాలి
  • మొక్కలు నాటడం, సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
  • ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ ‌కమిషనర్ల సమీక్షలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, మే 19(ప్రజాతంత్ర బ్యూరో) : పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. పలు సూచనలు చేశారు. జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు జరపాలని ఆదేశించారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌  ‌ఛైర్మన్లు, మున్సిపల్‌ ‌కమిషనర్లతో  ఈ సమావేశం జరుపుకుంటున్నామన్నారు. వొచ్చే నెల 3నుండి పట్టణ ప్రగతి ప్రారంభం అవుతుంది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ ‌కమిషనర్లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు గురువారం ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మునిసిప్‌ ‌ఛైర్మన్లు, కమిషనర్లతో మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ..పల్లె ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు చక్కటి రూపును సంతరించుకున్నాయనీ, అదే స్థాయిలో మన మున్సిపాలిటీలు మాత్రం బాగుపడ లేదని, ఈ దఫా పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల రూపు మారాలన్నారు. మున్సిపాలిటీల్లో వైకంఠధామాలు, వెజ్‌-‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌పనులు వేగవంతం చేయాలి. మొక్కలను పెద్ద ఎత్తున పెంచాలి. వాటి సంరక్షణ బాధ్యత మున్సిపల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులదే. గ్రామాల్లో చక్కగా మొక్కల పెంపకం, సంరక్షణ జరుగుతుంది. కానీ పట్టణాల్లో  కొంత నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. కొత్త మున్సిపల్‌ ‌చట్టం ప్రకారం మొక్కల సంరక్షణ చేపట్టకపోతే మున్సిపల్‌ ‌ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలకు  ఈ సారి వెనుకాడేది లేదని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ పరిస్థితి మన జిల్లాలో రావద్దు.

మొక్కల పెంపకం, సంరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో సిఎస్‌తో ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారనీ, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర మున్సిపల్‌ ‌సిబ్బంది, మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు బాగా పని చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా  మున్సిపాల్టీల్లోని అన్ని డ్రైన్లు, మోరీలు శుభ్రం చేయాలి. అందులోని సిల్ట్ అం‌తా తొలగించాలి. భారీ వర్షాలు పడినా మొరీల్లో సిల్ట్ అడ్డుపడకుండా ఉంటేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల పారిశుధ్యం విషయంలో గ్రామాలు బాగా మెరుగుపడ్డాయి. అదే స్థాయిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపాలిటీల పారిశుధ్యం బాగవ్వాలి. ఈ విషయంలో మున్సిపల్‌ ‌కమిషనర్లు, మున్సిపల్‌ ‌ఛైర్మన్లు, కౌన్సిలర్లు బాగా దృష్టి పెట్టాలన్నారు. చెత్త సేకరణ విషయంలో మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఇండోర్‌ ‌పట్టణం ఐదు సార్లు జాతీయ అవార్డు సాధించింది. అక్కడ ఐదు రకాలుగా చెత్త సేకరణ చేపడుతున్నారు. జిల్లా నుంచి అవసరం అయితే సిబ్బందిని, ప్రజాప్రతినిధులను ఇండోర్‌ ‌పర్యటనకు ప్రభుత్వం పంపుతుంది. అక్కడి విషయాలు నేర్చుకుని మనం అమలు చేద్దామన్నారు. చాలా మున్సిపాలిటీల్లో డంపుయార్డు నిర్మాణాలు పూర్తి కాలేదు. వెంటనే ఆ నిర్మాణాలు పూర్తి చేయాలి. పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడినప్పుడు, పట్టణాలు ఎందుకు బాగవవు. 12769 గ్రామాల్లో డంపు యార్డులు  ఉన్నాయి. అత్యధికంగా చెత్త ఉత్పత్తి అయ్యే మున్సిపాలిటీల్లో డంపుయార్డుల నిర్మాణం జాప్యం జరిగితే ఎలా? మీరు గట్టిగా పని చేస్తే పరిశుభ్రమైన పట్టణాలు రూపొందుతాయి. ఈ దిశగా అందరం కలిసి పని చేద్దామన్నారు.

ప్రతీ మున్సిపాలిటీలో మంచి స్థలం చూసి బృహత్‌ ‌పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలి. మియా వాకీ ప్లాంటేషన్‌(‌యాదాద్రి మోడల్‌) ‌ప్లాంటేషన్‌ ‌చేపట్టాలి. ప్రతీ మున్సిపాలిటీలో స్థల సేకరణ చేపట్టి స్పోర్ట్ ‌గ్రౌండ్‌ ఏర్పాటు చేయాలి. యువతతో కమిటీ వేయాలి. ఆ కమిటీకి ప్రభుత్వం క్రీడాసామగ్రి సరఫరా చేస్తుంది. నేడు మన దేశంలో, రాష్ట్రంలో బిపి, షుగర్‌, ‌డయాబెటిక్‌ ‌పేషంట్లు పెరుగుతున్నారు. క్రీడలు అవసరం. ఆరోగ్యవంతులైన తెలంగాణ పౌరులను తయారు చేయాలంటే క్రీడలు అవసరమన్నారు. సిఎం  కేసీఆర్‌  ఇది గమనించే ప్రతీ పట్టణంలోను, గ్రామంలోను క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. క్రీడామైదా•నాలు ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు సహకరించాలనానరు. మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్‌ ‌రోడ్లపై 3 లేదా 4 వరుసల్లో మొక్కలు నాటాలి. అలాంటి రహదారులను కమిషనర్లు గమనించి చక్కగా ప్లాంటేషన్‌ ‌పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల  గ్రీన్‌ ‌ఫండ్‌ ‌మున్సిపాలిటీల్లో ప్లాంటేషన్‌ ‌కోసమే ఖర్చు చేయాలన్నారు.  ప్రతి మున్సిపాలిటీలో నీటి కనెక్షన్లు పూర్తిగా ఇచ్చారా? లేదా? చూడాలి. నల్లా కనెక్షన్లు ప్రతీ ఇంటికి ఇవ్వాలి. దీంతో పాటు నీటి పన్ను పూర్తిగా వసూలు చేయాలి. కొన్ని మున్సిపాలిటీల్లో రోజుకో సమయానికి నల్లాలు వదులుతున్నారు. ఇది సరికాదు. ప్రతీ రోజు ఒకే సమయానికి నల్లాల ద్వారా నీరు వదలాలి. క్రమ పద్దతిలో నీరు వదిలేలా మున్సిపల్‌ ‌కమిషనర్లు చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రగతితో  జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల రూపు మారాలి. అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దన్నారు. త్వరలోనే మున్సిపాలిటీలకు అవసరమైన సిబ్బంది నియామకాలు జరుగుతాయి.  ఇంజనీర్లు, శానిటేషన్‌ ఇన్స్‌స్పెక్టర్లు, కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందన్నారు. తెలంగాణ మున్సిపాలిటీలు దేశానికి ఆదర్శంగా నిలబడాలి. అందులో జిల్లా మున్సిపాలిటీలు అగ్రభాగాన ఉండాలన్నారు.

పాత సొసైటీలకు ఇబ్బంది లేకుండా కొత్త సొసైటీలు ఏర్పాటు : ఫిషరీస్‌ అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి హరీష్‌రావు
ఎన్నో ఎళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్‌ ఉం‌ది. కానీ, ఏ ప్రభుత్వం వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాత్రమే  మత్స్య కార్మికుల సమస్యలు, డిమాండ్లపై స్పందించారు. ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఇస్తోన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, ఇతర పెండింగ్‌ ‌ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్‌ ‌కాకతీయ ద్వారా రాష్ట్రంలో నీట వనరులు గణనీయంగా పెరిగాయి. పాత సొసైటీలకు ఇబ్బంది లేకుండా కొత్తగా మత్స్య సొసైటీలు ఏర్పాటు చేస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఫిషరీస్‌ అధికారులతో గురువారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో జరిగిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ప్రతీ చెరువు కాళేశ్వరం నీటితో కళకళలాడుతుందనీ, చెక్‌ ‌డ్యాంలు పెద్ద ఎత్తున జిల్లాలో నిర్మించామనీ, దీని వల్ల నీటి వనరులు పెరిగాయనీ, వీటిలో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. కొత్తగా పెరిగిన నీటి వనరుల వల్ల ఆయా గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టవచ్చనీ, ఇలాంటి నీటి వనరులు ఉన్న చోట కొత్త మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్‌  ‌నిర్ణయించారన్నారు. నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది. కానీ, ఇప్పుడు  నీటి వనరులు పెరగడంతో ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటు ఏర్పాటు చేయడంతో పాటు, పాత  సోసైటీల్లోను ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉంది.

దీని వల్ల పాత సొసైటీల్లోను కొత్తగా సభ్యులను ఎంపిక చేయవచ్చనానరు.  సిద్దిపేట జిల్లాలో 281 సోసైటీలు ఉండగా అందులో 20731 మందికి సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఈ సొసైటీలు జిల్లాలోని 1255 నీటివనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 381 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మెదక్‌ ‌జిల్లాలో 263 సొసైటీల్లో 15724 మంది సభ్యులు ఉన్నారు.  ఈ సొసైటీలు జిల్లాలోని 1379 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి.  ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సంగారెడ్డి జిల్లాలో  193 సొసైటీల్లో 10434 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలు 875 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 196 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందనీ, మండల వారీగా, నియోజకవర్గాల వారీగా నీటి వనరులు ఎలా ఉన్నాయో లెక్క తెల్చాలని ఫిషరీస్‌ ‌శాఖకు మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఏ చెరువు వర్షం మీద ఆధారపడి ఉంది, ఏ చెరువుకు కాలువల నీరు చేరుతుందన్న సమాచారం సేకరించాలనీ, ఏ సోసైటీలో ఎందరు సభ్యులున్నారు. కొత్తగా ఎంత మంది చేర్చుకోవచన్న సమాచారం పక్కాగా సేకరించాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కొత్త సభ్యత్వం చేపట్టడం, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్య కార్మికులకు ఉపయోగాలున్నాయన్నారు.

సొసైటీలో సభ్యులు ఎక్కువ మంది ఉంటే బీమా సౌకర్యం కలుగుతుందనీ, రుణ సౌకర్యం సులువుగా జరుగుతుందనీ, ప్రభుత్వ సబ్సిడీ పథకాలు  అందరికీ వర్తిస్తాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు బండా ప్రకాష్‌  ‌బిబి.పాటిల్‌,  ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ‌మదన్‌రెడ్డి, మాణిక్‌రావు,  ఎమ్మెల్సీలు  వంటేరు యాదవ్‌రెడ్డి, పారూఖ్‌హుస్సెన్‌, ‌భూపాల్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే  చింత ప్రభాకర్‌,  ‌రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఫిషరీష్‌ ‌శాఖ  కమిషనర్‌ ‌లచ్చిరామ్‌ ‌భూక్యా, సంగారెడ్డి కలెక్టర్‌ ఎం.‌హనుమంతరావు, సిద్ధిపేట అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ఖాన్‌, ‌మెదక్‌ ‌జిల్లా అదనపు కలెక్టర్‌ ‌ప్రతిమా సింగ్‌,  ‌మత్స్య శాఖ అధికారులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page