తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: పరిగి లో చేల్లని రూపాయి తాండూర్లో చెల్లుతుందా.. అని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపల్లి, దరునివాగు తండా, హన్మాపూర్, గిర్మాపూర్ తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఅర్ఎస్ పార్టీ పథకాలు, మానిఫెస్టో ను ఎమ్మెల్యే గ్రామస్తులకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పరాయి ఒన్ని తెచ్చి తాండూరుపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని బయటోన్ని నమ్మితే ఆగం అవుతామని కాంగ్రెస్ కు ఓటు వేస్తే అన్ని పథకాలు కట్ అవుతాయని తెలిపారు. తాండూరు ప్రజలే నా బలం, బలగం..నాపై చూపుతున్న ఆదరాభిమానాలు ఎన్నటికీ మరవను.. కేవలం 2 ఎండ్లలో 1670 కోట్లతో తాండూరను అభివృద్ధి చేస్తున్నా.. నర్సింగ్ కాలేజ్, ఐటిఐ కళాశాల, పాత తాండూరు రైల్వే బ్రిడ్జి, మండలాల్లో జూనియర్ కాలేజి, ఇండస్ట్రియల్ పార్క్ లాంటి ఎన్నో తాండూరుకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొహిర్ శ్రీనివాస్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్, వెంకట్ రెడ్డి, ఎంపిటిసి ప్రవీణ్ పటేల్, సర్పంచులు బల్వంత రెడ్డి, చంద్రప్పా, పాషా, చిన్నా రెడ్డి, జనార్ధన్ రెడ్డి తదతరులు ఉన్నారు.