‘‘భారతదేశమంటే సర్వమత సమ్మేళనం అనే విషయాన్ని మరిచి, మరిపించి …..హిందూ దేశం అని, హిందూ రాజుల చరిత్ర తప్ప ఇతర రాజుల చరిత్ర ఉండకూడదు, ఉంచకూడదు అనే కోణంలో జరిగే ప్రయత్నంగా భావించవచ్చు . రానున్న కాలంలో చరిత్రలో హిందూ ధర్మం , హిందూ రాజులు వారి చరిత్రను మాత్రమే పాఠ్యాంశాలలో చొప్పించక పోరు. విద్యార్థుల నర నరాన హిందుత్వం నూరిపోసేందుకు గాను పొలిటికల్ సైన్స్ పుస్తకంలో నుంచి హిందుత్వాదుల పట్ల మహాత్మా గాంధీకి ఉన్న అయిష్టతను తెలిపే వాక్యాలను తొలగించారు.’’
ఇటీవల సంభవించిన కోవిడ్- 19 విపత్తు నేపథ్యంలో పాఠ్యపుస్తక రేషనలైజేషన్ పేరుతో ఎన్. సి. ఈ. ఆర్. టి వివిధ సబ్జెక్టులలో కొన్ని పార్టీ అంశాలను తొలగించింది. ఇలా తొలగించిన పాఠ్యాంశాలన్నీ కూడా పిల్లల్లో శాస్త్రీయదృక్పథంను, విచక్షణ జ్ఞానంను, చరిత్ర పట్ల అవగాహనను, జీవ పరిణామ క్రమ విషయ జ్ఞానాన్ని తుడిచి పెట్టే విధంగా ఉన్నాయి.
పిల్లల్లో విద్యార్థులలో స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం, విషయ అవగాహన, శాస్త్రీయ దృక్పథ వైఖరులను పెంపొందిం చేందుకు అవసరమైన అంశాలను పాఠ్యాంశములుగా చేర్చడం, క్షేత్రస్థాయిలో అమలు, ఉపాద్యాయుల సలహాలు, సూచనలు తీసుకుని పాఠ్యపుస్తకాలను రూపొందించాలి.ఈ ప్రక్రియలో పాత్రను పోషించే ఎన్. సి. ఈ.అర్. టి.ఇప్పుడు అన్ని వదిలి పాలకుల భావజాలానికి, ఆలోచన తీరుకు తలొగ్గుతూ వారికి అనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పన చేస్తుంది.ఉన్న పాఠ్యాంశాలను తొలగిస్తుంది. విద్యలో, పాఠ్యాంశాల రూపకల్పనలో రాజకీయ మతమౌడ్యాన్ని జొప్పిస్తుంది.
హేతుబద్ధ ఆలోచనలకు మూలస్తంభం అయిన చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం ను 9 మరియు 10వ తరగతిలో సైన్స్ పాఠ్యపుస్తకాల నుండి ఏకపక్షంగా తొలగించింది. దీన్ని ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఖండించినప్పటికీ ఎన్. సి. ఈ. అర్. టి. నుండి ఎటువంటి స్పందన లేదు. వారు రాసిన బహిరంగ లేఖలకు సమాధానమూ ఇవ్వలేదు.
డార్విన్ సహజ ఎంపిక సిద్ధాంతం విమర్శనాత్మక, శాస్త్రీయ ఆలోచనల ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. భూమండలం పై జీవ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది (మార్పుకు లోనౌతుంది) ఎందుకు ఎవరి జోక్యం అవసరం లేదని, జీవ పరిణామక్రమం వివరిస్తుంది. జీవనం కోసం పోరాటం అనేది కూడా కాలానుగుణంగా నిరూపించబడింది. కోతి (ఏప్) పరిణామ క్రమంలో మానవుడిగా మారాడని చెప్పిన సిద్ధాంతం అనేక పరీక్షలకు, నిరూపణలకు, నిలబడింది. డార్విన్ ఐదు సంవత్సరాలు బిగిల్ అనే నావ ద్వారా ఐదు ఖండాలను తిరిగి అనేకరకాల పరిశోధనలు చేసి, ఆధారాలను,అవశేషాలను సేకరించి ప్రతిపాదించిన సిద్ధాంతమే జీవపరిణామ సిద్ధాంతం. దీన్ని తోసిపుచ్చి కొంతమంది జీవుల పుట్టుక దైవిక నిర్ణయం అని, మానవుడు దేవుని సృష్టి అని చేసే నిరాధార, మూఢనమ్మక, మతతత్వ అంశాన్ని చిన్నారుల మెదడులలోకి జొప్పించే ప్రయత్నంలో భాగంగా ఎన్. సి. ఈ.అర్.టి ఈ పాఠ్యాంశాన్ని తొలగించింది.
డార్విన్ జీవనశైలి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. శాస్త్ర పరిశోధన ద్వారా విషయాల్ని తెలుసుకొని నమ్మడం, త్యాగపూరిత జీవితం, మతాన్ని ఎదిరించి నిజం వైపు నిలబడడం, అపార రచనా శక్తి, వెన్ను చూపని సాహసం. ఇలాంటి అంశాలను విద్యార్థులకు తెలియచేయాల్సిందానికి బదులుగా రానున్న రోజులలో జీవుల పుట్టుక దైవిక సంభంధమని, మనువాద సిద్ధాంతాలను పాఠ్యాంశాలలో చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు.
12వ తరగతి చరిత్ర పుస్తకాల నుంచి మొగలులకు సంబంధించి ‘థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ‘ అనే పేరుతో ప్రచురించిన మూడు భాగాలలో రెండవ భాగంలోని తొమ్మిదవ అధ్యాయం ‘కింగ్ అండ్ హిస్టరీ మొగల్దర్బార్ ‘ అనే పాఠ్యాంశంను పుస్తకము నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని భారతదేశ చరిత్ర నుండి మొగలుల / ముస్లిం రాజుల చరిత్రను చెరిపివేసే ప్రయత్నంగా పరిగణించవచ్చు. భారతదేశమంటే సర్వమత సమ్మేళనం అనే విషయాన్ని మరిచి, మరిపించి …..హిందూ దేశం అని, హిందూ రాజుల చరిత్ర తప్ప ఇతర రాజుల చరిత్ర ఉండకూడదు, ఉంచకూడదు అనే కోణంలో జరిగే ప్రయత్నంగా భావించవచ్చు . రానున్న కాలంలో చరిత్రలో హిందూ ధర్మం , హిందూ రాజులు వారి చరిత్రను మాత్రమే పాఠ్యాంశాలలో చొప్పించక పోరు. విద్యార్థుల నర నరాన హిందుత్వం నూరిపోసేందుకు గాను పొలిటికల్ సైన్స్ పుస్తకంలో నుంచి హిందుత్వాదుల పట్ల మహాత్మా గాంధీకి ఉన్న అయిష్టతను తెలిపే వాక్యాలను తొలగించారు.ఇందుకు కారణం హిందుత్వం పేరుతో ఆర్.ఎస్.ఎస్ శక్తుల అరాచక చర్యలను గాంధీ గారు వ్యతిరేకించారు. ఆ విషయం భవిష్యత్తు తరాలకు తెలియ రాదని, అంతేకాక జాతిపిత మహాత్మా గాంధీని చంపిన కారణంగా ఆర్.ఎస్.ఎస్. పై నిషేధం విధించారు. అయితే గాంధీని చంపిన నాథూరం గాడ్సే బ్రాహ్మణుడు. అందులోను ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త . కనుక ఈ విషయాన్ని మరుగుపరిచేందుకుగాను పాఠ్యాంశాల నుంచి తొలగించారు. ఇది పాలకులకు, ఆర్.ఎస్.ఎస్ పట్ల సానుకూలతను చూపే అంశమే. ఎన్. సి. ఈ. అర్. టి దీనికి వంతపాడడం దురదృష్టకరం .
11వ తరగతి సోషియాలజీ పుస్తకము నుండి గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలను తీసివేశారు. గుజరాత్ అల్లర్లకు కారణమైన వారు అధికారంలో ఉన్నందున, జరిగిన వాస్తవ సంఘటనను చెరిపివేసి చరిత్ర రూపంలో ముందుతరాల వారికి అందకుండా చేస్తూ, సొంత చరిత్రను రాయించుకుంటున్నారు.దీనిపై ఎన్ని వ్యతిరేకతలు,విమర్శలు వచ్చినా ఎన్. సి. ఈ. అర్. టి. పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా చూస్తూ పోతే చాలా అంశాలు ఉన్నాయి.
శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్న పోటీ ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు పోటీపడుతూ అగ్రస్థానానికి చేరుకోవడం కోసం భారతదేశము ప్రయత్నిస్తుంది.దేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రణాళికలు పాఠ్యాంశాలను రూపొందించాల్సిన తరుణంలో పాఠ్యాంశాలను తొలగిస్తూ దేశ పురోభివృద్ధికి బదులు తీరోగమనానికి నెట్టేస్తూ ‘గో బ్యాక్ ఇండియా’ గా చేపట్టే ఈ కార్యక్రమాలు మంచివి కావు. కోవిడ్- 19 విపత్కర పరిస్థితిలో ప్రపంచ దేశాలలో అన్నింటికన్నా ముందు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసింది మన దేశమే, అంతరిక్ష పరిశోధన లోను, సాటిలైట్ రంగంలోనూ, కంప్యూటర్ రంగంలోనూ అగ్రభాగాన ఉన్న మన దేశంను, యువతను ప్రోత్సహించి ముందుకువెళ్ళడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించే పాఠ్యాంశాలను తొలగించి, మూఢనమ్మకాలను అశాస్త్రీయ అంశాలను నూరిపోసే విధంగా పాఠ్యాంశాలను రూపొందించడం సరికాదు. ఇది దేశ భవిష్యత్తుకు, భావితారాల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు వంటిది.కనుక ఇకనైనా ఎన్. సి. ఈ. ఆర్.టి పాఠ్యాంశాల తొలగింపు మానుకొని విద్యార్థులకు ఉన్నతమైన విషయ జ్ఞానాన్ని, శాస్త్రీయ పరిశోధన విలువలను, సైంటిఫిక్ టెంపర్ ను, పెంపొందించే జ్ఞానవంతమైన సమాజాన్ని, దేశాన్ని రూపొందించే పాఠ్యాంశాలను చేర్చి, పుస్తకాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను ఎన్.సి. ఈ.అర్.టి నిర్వహించాలి . ఎన్.సి. ఈ. అర్.టి స్వతంత్రంగా, ఖచ్చితత్వంతో పాలకులకు వంత పాడకుండా ఉపాధ్యాయుల,విద్యావేత్తల సహకారంతో పాఠ్యాంశాలు రూపొందించుకొని తద్వారా దేశాన్ని అగ్రబాగాన నిలపాల్సి ఉంటుంది.ఆ దిశగా ప్రజలు, విద్యార్ధులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు,రాజకీయపక్షాలు,పా
– సజ్జనము విద్యాసాగర్,
ఉపాధ్యాయులు, 9441603977.