పీఎంకిసాన్ పథకానికి సంబదించి ఈకేవైసి తప్పనిసరి అని మదనపల్లి వ్యవసాయ అధికారి నాగప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వివరాలను మంగళవారం తెలియజేశారు.ఈ గడువు తేదీ మొదట ఏప్రిల్ 31 గా తెలిపినప్పటికి సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటికే మదనపల్లి మండలం లో 70 % రైతులు ఈకైవైసి చేసుకొన్నారు.రేపే ఆఖరు గడువు కాబట్టి ఇంకను ఎవరైనా చేసుకోవలసిన వారు ఉంటే వెంటనే తమ సమీపంలోని సిఎస్సి కేంద్రం లేదా ఆర్ బి కే లను సందర్శించి ఈ కేవైసీ పొందగలరు అని వ్యవసాయాధికారి తెలిపారు.