అడ్డంగా దొరికిన బిజెపి నేతలు
లీక్ చేసింది బండి అనుచరులే
పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బిజెపి
దమ్ముంటే రాజకీయంగా కొట్లాడుదాం
ఇక్కడున్నది కెసిఆర్ ప్రభుత్వం అని గుర్తించు
వి•డియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్ రావు
మెదక్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : పేపర్ లీకులు చేసినవాళ్లంతా బీజేపీవాళ్లే..బండి సంజయ్‌దే ప్లాన్ అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ముందు బీజేపీ పప్పులుడకయ్..హనుమంతుడి ముందు కుప్పిగంతులొద్దని హితవు పలికారు. బుధవారం మెదక్‌లో పర్యటించిన మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలసి వి•డియా సమావేశంలో మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కునే దమ్ములేక బీజేపీ పసిపిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడిందని..బీజేపీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. తాండూరులో పదవ తరగతి పేపర్ లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారని,.ప్రశాంత్‌కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని హరీష్ రావు ధ్వజమెత్తారు. బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయినా బుకాయిస్తున్నారని హరీష్ రావు వెల్లడించారు. భవిష్యత్ తరాలకు బీజేపీ ఏం సందేశం ఇవ్వదలుచుకుందని నిలదీశారు.
రాష్ట్రంలోని విద్యార్థులు బీజేపీ కుట్రలను గమనించాలని సూచించారు. బీజేపీకి చదువు విలువ తెలియదు..బీజేపీలో చదుకున్నోళ్లు తక్కువ ఉన్నారని ఎద్దేవ చేశారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారుడని ఆరోపించారు. 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం పదవ తరగతి పేపర్ లీకేజీ జరిగిందని బీజేపీ ధర్నా చేసింది..సాయంత్రం నిందితులను విడుదల చేయాలని మళ్లీ ధర్నా చేసింది..దీంతో బీజేపీకి ఈ ఘటనతో సంబంధం ఉందని తేలిపోయిందన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండి సంజయ్‌ని సమర్థించడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు, లీకేజీలో, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ కుట్రలు రెడ్ హ్యాండెడ్‌గా బయట పడ్డాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌కు కొన్ని సూటి ప్రశ్నలు వేయదలుచుకున్నా..పదవ తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్‌లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా…ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని నీకు వాట్సాప్‌లో పంపింది నిజమా కాదా..రెండు గంటల్లో 142 సార్లు నీతో నిందితుడు ఫోన్లో మాట్లాడలేదా ..పనిగట్టుకుని ప్రశ్నాపత్రాలను వి•డియా గ్రూపులకు, వెబ్సైట్‌లకు వి• ప్రోద్భలంతో పంపింది నిజం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావ్ బండి సంజయ్ అని మంత్రి హరీష్ రావు నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లాగా వి• గుండా గిరి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని హెచ్చరించారు. బీజేపీకి బండి చేతిలోనే మూడినట్టుందని ఎద్దేవ చేశారు..వి•కు ఫేక్ డిగ్రీలు కామన్ కావచ్చు.. కానీ ఎంతో మంది కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో చేలాగాటమాడవద్దని తెలిపారు. బీజేపీ విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దని కోరారు.
రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది.. దాన్ని కేసీఆర్ ఎదుర్కుంటారని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలు చేదిస్తూనే ఉంటాం.. తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్నారు. బండి సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్‌ను కోరుతున్నామని అన్నారు. రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని హరీశ్ రావు విమర్శించారు. పట్టపగలు బండి సంజయ్, బీజేపీ పార్టీ దొరికిపోయాయని హరీష్ రావు అన్నారు. స్పష్టంగా దొరికిపోయినప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి రాజకీయాలు అవసరమా అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని..కేంద్రంలో బీజేపీ ఉందన్నారు. మనం భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలి కానీ.. రాజకీయాల కోసం భవిష్యత్తు తరాల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు. ఇదంతా రాష్ట్ర, దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీ అంటేనే ఒక విద్వేషం.. ఒక విచ్ఛిన్నం చేసే కుట్ర, విధ్వంసం చేసే కుట్ర అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎంతసేపు రాజకీయాల కోసం, అధికారం కోసం ఏదైనా చేస్తారని అర్థమవుతుందని తెలిపారు. దీన్ని విద్యార్థులంతా గమనిస్తున్నారని అన్నారు. విద్యార్థులు దీన్ని తిప్పికొట్టాలని.. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ’ పదో తరగతి పిల్లలకు, తల్లిదండ్రులకు ఎక్కడా ప్రశ్నపత్రం లీకవ్వలేదు. ఇదంతా బీజేపీ కుట్ర. ఈ కుట్రలో మనం ఎవరం పడొద్దు. పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లల చదువు వి•ద దృష్టిపెట్టాలి. ’ అని విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.