పోటాపోటీగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

“ఒక వైపు తెలంగాణపైన సవతితల్లి ప్రేమ కనబరుస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏనాడులేని విధంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తుందని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడడం తమకు ఎంతమాత్రం ఇష్టంలేదన్న రీతిలో తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ విమర్శించిన వీరికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేసే అర్హత లేదని వారు వాదిస్తున్నారు.”

దిల్లీ వీధుల్లో తెలంగాణ వైభవం ..!
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం ఈసారి వినూత్నంగా జరుగబోతున్నది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశ రాజధానిలోనూ ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తున్నాయి. దేశ చరిత్రలో ఇంతవరకు కొత్తగా అవతరించిన రాష్ట్రాలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దాఖలాలు లేవు. అందునా అధికారికంగా జరిపిన వేడుకలు కూడా లేవు. కాని ఈసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో కొత్త పరిణామానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఏర్పడడానికి సహకరించిన పార్టీగా చెప్పుకుంటున్న భారతీయ జనతాపార్టీ ఈ కొత్త ఆలోచనకు తెరలేపింది.. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వొచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఏనాడు ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఆమేరకు చేసిన ప్రయత్నాలు కూడా లేవు. ఎంతసేపు దాని వివాదమంతా సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన విషయంగానే ఉంటూ వొచ్చింది. గడచిన ఎనిమిదేళ్ళుగా ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌ ‌నెల వస్తుందనగానే ఈ వివాదం మొదలయ్యేది.

ఆ తర్వాత దాన్ని అటుకెక్కించడం ఆ పార్టీకి అనవాయితీగా మారింది. ఆలాగే ఏనాడు తెలంగాణ రాష్ట్ర అవతర వేడుకలను ప్రత్యేకంగా జరిపే ఆలోచన చేసిందిలేదు. అయితే కొత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కారణమేమై ఉంటుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి బిజెపికి అసలు పొసగటంలేదు. రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి బిజెపి నాయకుల వరకు అందరూ టిఆర్‌ఎస్‌ను టార్గెట్‌ ‌చేయడంలో ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడంలేదు. ఇటీవల కాలంలో ఒకరి తర్వాత ఒకరుగా ఆ పార్టీ కేంద్ర నాయకులు రాష్ట్రానికి వొచ్చి తెరాస ప్రభుత్వంపై విరుచుకు పడిన తీరు బహిరంగ రహస్యమే. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దించేందుకు బిజెపి యేతర పార్టీలతో కూటమి కట్టాలని కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలపై ఎప్పుడైతే దృష్టి సారించాడో అప్పటినుండి టిఆర్‌ఎస్‌పై బిజెపి దాడి మరింత ఎక్కువైయింది. విచిత్రమేమంటే తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఈ రెండు పార్టీల మధ్య స్నేహం బలంగానే ఉండింది. టిఆర్‌ఎస్‌ ‌రెండవ సారి అధికారంలోకి వొచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలమద్య ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటోంది.

తెలంగాణ ఏర్పడిందే నిధులు, నియామకాలు, నీళ్ళు అన్న ట్యాగ్‌లైన్‌ ‌మీద. నిధుల విషయంలో కేంద ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదన్నది టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్గాల ఆరోపణ. రాష్ట్రంనుండి చేరాల్సిన నిధులు పన్నుల రూపంలో కేంద్రానికి చేరుతున్నప్పటికీ, తిరిగి రాష్ట్రాలకు కేటియించే విషయంలో మాత్రం కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అంతేకాదు అనేక విభజన హామీల్లో ఏ ఒక్కదాన్నికూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందన్నది టిఆర్‌ఎస్‌ ఆరోపణ. దేశంలో 157 మెడికల్‌ ‌కళాశాలలకు అనుమతించి, తెలంగాణకు మొండి చెయ్యి చూపించడం, నవోదయ పాఠశాలల విషయమైతేనేమీ, ఐఐఎం, ఐఐఐటిల్లో ఒక్కటికూడా తెలంగాణకు కేటాయించకపోవడం, వరంగల్‌లో ఏర్పాటు చేస్తామన్న వరంగల్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీని మంజూరు చేయకపోవడం, గత ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో పసుపు బోర్డును తీసుకొస్తామన్న హామీని నిలుపుకోకపోవడం లాంటి పలు అంశాలను తీసుకుని టిఆర్‌ఎస్‌ ‌కేంద్రంతో పోరాడుతోంది. అన్నిటికీ మించి వరికొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక విధంగా పెద్ద యుద్దమే జరిగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్నే దోషిగా చూపించాలని కేంద్రం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ పోయారు. దీనిపై సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దిల్లీ స్థాయిలో ధర్నాలు చేసిన కేంద్రం ఏమాత్రం స్పందించలేదు సరికదా రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపడంతో టిఆర్‌ఎస్‌ ‌తట్టుకోలేకపోతోంది. ఈ చర్చల సందర్భంగా కేంద్రం తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడిందంటూ టిఆర్‌ఎస్‌ ‌నాయకులు కేంద్ర ప్రభుత్వంపైన, బిజెపి పార్టీపైన విరుచుకుపడుతున్నారు.

మరో ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్‌ను పక్కకు తోసి టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యమ్నాయం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో రానున్న ఎన్నికపై బిజెపి దృష్టి పెట్టింది. అందులో భాగంగా ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలు చేయడంతోపాటు కేంద్ర స్థాయి నాయకులతో కేంద్రం ఏమేరకు తెలంగాణకు నిధులు అందిస్తున్నదన్న విషయాన్ని చెప్పిస్తోంది. అదే క్రమంలో ఇప్పుడు రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించడంద్వారా తెలంగాణపై తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జూన్‌ 2‌న దిల్ల్లీలోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు రంగం సిద్దంచేసింది. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని ప్రకటించిన ఆజాదీ కా అమృత్‌ ఉత్సవ్‌లో భాగంగా దీన్ని చేపడుతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ ప్రజల భూమి మూలాలను హైలెట్‌ ‌చేయడంతోపాటు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page