‘వాళ్లు అడవి బిడ్డలు
ఈ దేశ మూల వాసులు
వనసంపదకు వారసులు
అనాదిగా పోడుభూములు
ఆసరాగా బతుకుతునోళ్ళు
ఇపుడు…
దోపిడీ మరిగిన రాజ్యం
అటవి భూములపై కన్నేసి
తేరగ కాజేయ పూనుకుంది
పట్టాల హామీల పాతరేసి
ఖాకీ మూకలను ఎగదోసి
గిరిజన మహిళలు,తల్లుల్ని
బట్టలు ఊడేటట్టు చితక్కొట్టి
చీకటి కటకటాల్లోకి నెట్టేసింది
పాలకుల పాశవికత్వానికి
పూరి గుడిసెలు కూలినయ్
పంటచేలు మంటగలిసినయ్
జీవనాదరువులు చెదిరినయ్
ఓయ్ గడీల పాలకుడా !
ఆదివాసులు, గిరిజనులపై
విద్వేష విషాన్ని వెళ్లగక్కితే
నీ పతనానికి హేతువే సుమీ
అదిగో అటు చూడు..!
గడ్డి పరకలు గర్జిస్తున్నయ్
తెల్ల మల్లెలు ఎర్రబారినయ్
చలి చీమలు దండుగట్టినయ్
పశు పక్షాదులు తొడగొట్టినయ్
కర్రలు, కారాలు కదంతొక్కినయ్
వన ప్రాణులు రణమెత్తుకున్నయ్
ఇంద్రవెల్లి అమర స్థూపం సాక్షిగా
ఇక నిన్ను వెంటాడి తరుముతయ్
దుష్టపాలనకు చరమగీతి పాడుతయ్
(ఆదివాసులపై రాజ్యం దాష్టికాలకు నిరసనగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493