ప్రజాయుద్ధ నౌక గద్దర్ అలియాస్ విఠల్ రావు ఆదివారం హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో సా.3.30 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు.
సుదీర్ఘ కాలం పాటు విప్లవోద్యమం తో పాటు ప్రజా ఉద్యమాలలో సాంస్కృతిక ఉద్యమాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బుల్లెట్ లను సైతం లెక్కచేయకుండా అలుపెరగని ప్రజా యుద్ధ పోరాట యోధుడు గద్దర్ మృతి అత్యంత విషాదకరం.
తెలంగాణ ఉద్యమం లో అగ్రభాగాన నిలిచిన గద్దర్ తెలంగాణలో ప్రజాస్వామ్యంతో పాటు తెలంగాణ వనరులు మాకే తగ్గాలని ,మా నీళ్లు ,మా నిధులు మాకే దక్కాలని గొంతు ఎత్తి ప్రతినిత్యం పాట పాడే ప్రజా గాయకుడు గొంతు మూగబోయింది.