‌ప్రజాభవన్‌ ‌వేదికగా తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

  • అధికారులు, మంత్రుల సమక్షంలో సమావే
  • పరస్పరం పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు
  • ఎపి సిఎం చంద్రబాబుకు కానుకగా కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేసిన సిఎం రేవంత్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలుత తెలంగాణ సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రజాభవన్‌కు చేరుకోగా తరవాత చంద్రబాబు వొచ్చారు. ఆయనకు సిఎం రేవంత్‌ ‌పుష్పగుచ్ఛం అందచేసి ఘనంగా స్వాగతించారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు పుష్పగుఛ్చం అందించారు. ఇలా మంత్రులు కూడా పుష్పగుచ్చాలు అందించి స్వాగతించారు. పరస్పర పుష్పగుఛ్చాలతో స్వాగత కార్యక్రమం సాగింది.

అనంతరం ఇరు రాష్ట్రాల అధికారులు, మంత్రులు, సిఎంలు భేటీ అయ్యారు. ఈ సందర్భందగా తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణ రాసిన ’నా గొడవ’ కవితల సంకలనాన్ని చంద్రబాబుకు రేవంత్‌ ‌రెడ్డి కానుకగా ఇచ్చారు. సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, ‌బీసీ జనార్దన్‌ ‌రెడ్డి, చీఫ్‌ ‌సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు.  తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీ‌ధర్‌ ‌బాబు, చీఫ్‌ ‌సెక్రటరీ పలువురు ఐఏఎస్‌  అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటా నలబై ఐదు నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page