- అమెరికాలో బేయర్ పత్తి పరిశోధన కేంద్రం సందర్శించిన రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి
- పత్తిలో ఉత్పాదకత పెంచడంపై అద్యయనం చేస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం హిర్సూటం రకానికి చెందిందే ఉంటుందన్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఉన్న బేయర్ పత్తి విత్తన, జన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలి ంచింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లో సుమారు 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు.
ఇండి యాతోపాటు చైనా, అమెరికాలలో పత్తి ఎక్కువగా సాగవుతుందని చెప్పారు. భారతదేశంతోపాటు ప్రధానంగా దక్కన్ పీఠభూమి పత్తి సాగుకు అత్యంత అనుకూలమని వెల్లడించారు. దేశంలో 2030 నాటికి పత్తి ఉత్పత్తి 7.2 మిలియన్ టన్నులకు చేరుందన్నారు. 2002 నుంచి పురుగులను తట్టుకునే బోల్‌గార్డ్ రకం హైబ్రీడ్ పత్తి సాగవుతుందని, దీంతో పంట ఉత్పాదకత పెరిందని తెలిపారు. బేయర్ విత్తన సంస్థ అనేక దేశాల్లో పరిశోధనలు జరిపి అక్కడి వాతావరణ, భూ పరిస్థితులకు అనుకూలమైన ఎక్కువ దిగుబడినిచ్చే రకాలను అందిస్తున్నదని చెప్పారు. పత్తిసాగులో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పాదకత పెంచడంతోపాటు పంటకోతలో ఉన్న సమస్యలను సరళీక రించేందుకుకు అమెరికాలో అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణకు పత్తి, మొక్కజొన్న, కూరగాయల రకాల్లో నూతన వంగడాలను అందించేందుకు బేయర్ సంస్థ సంసిద్ధత వ్యక్తంచేసిందన్నారు. అమెరికాలో వ్యవసాయ కమతాలు పెద్దవికావడంతో వారు యాంత్రీకరణతో అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు. తక్కువ విస్తీర్ణంలో తక్కువ రోజుల్లోనే అధిక ఉత్పత్తి సాధిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పత్తు సాగు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తుందన్నారు.