ఆశల పల్లకిలో తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఏకం అయ్యారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మొన్నటివరకు భారత్ రాష్ట్ర సమితి వెంట ఉంటూ వచ్చిన ఈ మైనారిటీ వోటుబ్యాంకు.. కాంగ్రెస్ వైపునకు మళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ హామీలను నెరవేర్చకపోవడం, బీజేపీతో బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకుందనే అనుమానాలు వ్యక్తమౌతోండటం, మేనిఫెస్టోలో డిమాండ్లను చేర్చకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్కు తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఐక్య కార్యాచరణ కమిటీ దూరమైంది.
రాష్ట్రంలో డా.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు, అరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మంట్, ఇరిగేషన్ ప్రాజెక్టుల విస్తరణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఐటీని ప్రమోట్ చేసింది కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని, లక్ష్మి సైబర్ సిటీ, పివి ఫ్లై ఓవర్ నిర్మాణం ట్రిపుల్ ఐటి ల ఏర్పాటు, అనేక చోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో రిమ్స్, స్విమ్స్ వంటి అధునాతన వైద్య శాలల నిర్మాణం ముఖ్యమంత్రి డా.రాజశేఖర రెడ్డి హయాంలోనే నని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలే నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అధికార బీఆర్ఎస్ బలంగా ఉండగా, ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని ప్రచారం జరుగుతోంది. వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో పోరు నువ్వా నేనా అన్నట్లుందిగా ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 24 సీట్లు తెలంగాణలో సచివాలయానికి కీలకం కాగలవని నమ్మకం. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందా? గతంలో కంటే కొంత బెటర్ గా కనిపిస్తుందా? అధికార పార్టీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత కాంగ్రెస్ సమర్థవంతంగా తన వైపు తిప్పుకుంటుందా? అంటే కొంత మేర అవుననే అనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని సంస్థలు చేసిన సర్వేలోనూ కాంగ్రెస్ పట్ల జనంలో సానుభూతితో పాటు ఒక్కసారి అధికారం ఇస్తే పోలా అన్న ధోరణి కనిపిస్తుందన్నది స్పష్టమయింది. బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి కాంగ్రెస్ ఎంత మేరకు పుంజుకుంటుందన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్నే అయినప్పటికీ జనంలో మార్పు కోరుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం.
ఇక్కడ బీజేపీకి సరైన వోటు బ్యాంకు లేదు. అలాగే సంస్థాగతంగా కూడా పార్టీ బలంగా లేదు. 2019లో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలవడంతో తాము అధికారంలో వస్తామని ఆ పార్టీ భావిస్తూ ఎన్నికలకు వెళ్లడంలో తప్పేమీ లేదు. కానీ కాంగ్రెస్ ను అంత సులువుగా అంచనా వేయడానికి వీలులేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో క్యాడర్ తో పాటు వోటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పుంజుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. ప్రజలు ఒక్కసారి చూద్దాం అని భావిస్తే సునామీ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనం ఎంత పాలన బాగా చేసినా మార్పు కోరుకుంటారు. ఇది మానవ నైజం. ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో మార్పు తప్పనిసరి. ఒకసారి పాలన బాగుంటుంది. రెండోసారి పాలన సుమారుగా అనిపిస్తుంది. మూడోసారి ఎన్నికలకు వచ్చే సరికి విసుగొచ్చేస్తుంది. మంత్రుల వ్యవహారశైలి, అధికారుల పనితీరు వంటివి కూడా పాలనపై ప్రభావం చూపిస్తాయి. అది ఎన్నికల సమయంలో ప్రజల్లో బయటకు వస్తుంది. ఇది ఎక్కడైనా జరిగేదే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. సొంతమూ కాదు. ఎంత మంచిగా పరిపాలించినా అందులో లోటుపాట్లు సహజం. అధికార పార్టీతో తృప్తి పడే వారికంటే అసంతృప్తికి లోనయ్యే వారి సంఖ్య రోజుకు రోజుకూ పెరిగిపోవటం సహజమే.
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకుందన్న వార్తలు వస్తున్నాయి. అనేక సర్వేల్లో కూడా ఇదే వ్యక్తమైంది.. కాంగ్రెస్ పుంజుకోవడానికి అనేక కారణాలున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర మాత్రమే కాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తుండటంతో పాటు కొన్ని సమస్యలకు కాంగ్రెస్ అయితేనే పరిష్కారం చూపగలదన్న విశ్వాసం మరొక వైపు కనిపిస్తుందంటున్నారు. సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ అంతకు మించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవ్వగలదని నమ్మే వారు కూడా ఇటీవల పెరిగారు. అందుకే కాంగ్రెస్ ను ఆషామాషీగా చూసే వాళ్లకు వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ ఒక పాఠం చెబుతాయని కూడా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు. మొత్తం మీద ఈ వార్తలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నా నేతలు ఐక్యతగా ఉండి పోలింగ్ వరకూ ఎలా వ్యవహరిస్తారన్న దానిపైనే ఆధారపడి ఉందన్నది కూడా ప్రశ్నార్ధకమే..
ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నేతలు
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. అందులో భాగంగానే ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నేతలు పాల్గొంటూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా నాయకత్వానికి ధీటుగా కాంగ్రెస్ ముఖ్యనేతలు తెలంగాణ లో సుడిగాలి పర్యటనల్లో ఉన్నారు. అందులో భాగంగానే ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నేతలు పాల్గొంటూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేరు. శని, ఆదివారాల్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడలలో రాహుల్ గాంధీ ఎన్నికల, ప్రియాంకా గాంధీ పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు జుక్కల్, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనున్నారు. హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో డీకే శివకుమార్, సనత్ నగర్, కల్వకుర్తి ఎన్నికల ప్రచార సభలలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్నారు. సాయంత్రం దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు చేరుకుని. వార్‌రూమ్ నుంచి కాంగ్రెస్ ఎన్నికలు, ప్రచారం తదితర విషయాలను పర్యవేక్షించనున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల క్రతువు ముగియటంతో.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని రాష్ట్రంలో మోహరించింది. ఆకట్టుకునే హామీలు, అధికార పార్టీని ఢీకొట్టే ఎత్తులతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు అగ్రనేతలు. పార్టీ అధినాయకత్వం మిగిలిన రెండు రోజులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి సారించింది. అగ్రనేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు, రాష్ట్ర నేతలు తీరిక లేకుండా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈనేపథ్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ప్రచారానికి హైదరాబాద్ చేరుకున్నారు. భారాసా కర్ణాటక ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని విద్యుత్ సరఫరా , తాము అమలు చేస్తున్న ఎన్నికల వాగ్దానలను వివరిస్తూ కాంగ్రెస్ ఎక్కడైనా ప్రజల పక్షపాతి అని అన్నారు. ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కూడా వేర్వేరు ప్రాంతాలలో పర్యటించారు.
అధికార పార్టీని ఢీకొట్టే ఎత్తులతో ప్రియాంక, రాహుల్ తెలంగాణలో ఎన్నికల హడావుడి జోరు బస్సు యాత్రలతో పాటు ఆయా పట్టణాల్లో పాదయాత్రలను కూడా పూర్తయ్యాయి.. అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. పర్యటన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్రంలో మూడు విడతలుగా బస్సుయాత్రను ప్లాన్ చేసింది రాష్ట్ర నాయకత్వం. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర ఉండగా.. మళ్లీ దసరా తర్వాత రెండో దశ బస్సు యాత్ర , ఇక మూడవ దశ బస్సు యాత్ర నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తయ్యాయి రాహుల్, ప్రియాంకల పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. తెలంగాణలో ఎన్నికల హడావుడి జోరు బస్సు యాత్రలతో పాటు ఆయా పట్టణాల్లో పాదయాత్రలను కూడా పూర్తయ్యాయి. ఏఐసిసి, టిపిసిసి కలసి ప్రకటించిన రాహుల్, ప్రియాంకల పర్యటన షెడ్యూల్ విడుదలై, అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మూడు విడతలుగా బస్సుయాత్రను ప్లాన్ చేసింది రాష్ట్ర నాయకత్వం. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర, దసరా తర్వాత రెండో దశ బస్సు యాత్ర, మూడవ దశ బస్సు యాత్ర నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తయ్యాయి. .
ఇందిరా గాంధీని తలపించే ప్రియాంక
ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీని పోలి ఉండడంతో .. ఆమెను చూసిన వాళ్లు ఎవరైనా అనుకునే తొలి మాట, ‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’ అని. ఇందిరాగాంధీ ఈ తరానికి తెలయకపోవచ్చు. కానీ ఇందిర సాహసం.. ఎన్నికల ప్రసంగాలు విన్నవారికి ఆమె అంటే ప్రత్యేక అభిమానం. ప్రత్యేకంగా పేదలు ‘‘అమ్మ’’గా పిలుచుకున్న నేత ఇందిరాగాంధీ. ఇందిర హఠాన్మరణంతో కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టినా ఆయన సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే వాళ్లు లేకపోలేదు. అలాంటి నాయనమ్మ పోలికలున్న ప్రియాంక గాంధీ చాలా ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ జోక్యం లేదు. ఎన్నికలకు తన అవసరం ఉందని గుర్తించడంతో రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీ తరుపున మాత్రమే అమేధీ, రాయబరేలీలలో ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప దేశంలో ఏ ఎన్నిక జరిగినా సంబంధం లేనట్లే ఉన్నారు. ఇప్పుడు సోదరుడు రాహుల్ ఏకాకిగా మారడంతో గత ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిపోయారనే చెప్పాలి. అలాంటి ప్రియాంక గాంధీ సభలకు పెద్దయెత్తున హాజరవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణులు, 50 ఏళ్ళ వయసు వారు ఆమె ప్రసంగాలకు ముగ్దులవుతున్నారు.
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె స్పెషల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రియాంక గాంధీ పాత్రను కాదనలేమనే భావన ఉంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండగా జరిగిన ఎన్నికల్లోనూ ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మిజోరాం, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆమె ప్రచారం కూడా ఇందుకు ప్లస్ అయందని నేతలు నమ్ముతున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రియాంక గాంధీ కీలకంగా మారారు. ఆమె ప్రచార సభలకు కావాల్సినంత మంది జనం. ఆమె నవ్వు, హావభావాలు అన్నీ ఇందిరమ్మను చూసి నట్లే ఉండటంతో ఎక్కువ మంది ఆమెను దగ్గరగా చూసేందుకు వస్తున్నారు. ప్రియాంక గాంధీ ప్రచారంతో తమ గ్రాఫ్ మరింత పెరిగిందని కాంగ్రెస్ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకా ప్రచారానికి రెండు రోజులు సమయం ఉండటంతో ఒక్కసారి తమ నియోజకవర్గానికి వచ్చిపోమ్మ%శీ%టూ వినతులను సమర్పించుకుంటున్నారు. కర్ణాటక తరహాలో ప్రియాంక గాంధీ ప్రచారం హిట్ అవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు.
తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ అండ
తెలంగాణలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఏకం అయ్యారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మొన్నటివరకు భారత్ రాష్ట్ర సమితి వెంట ఉంటూ వచ్చిన ఈ మైనారిటీ వోటుబ్యాంకు.. కాంగ్రెస్ వైపునకు మళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ హామీలను నెరవేర్చకపోవడం, బీజేపీతో బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకుందనే అనుమానాలు వ్యక్తమౌతోండటం, మేనిఫెస్టోలో డిమాండ్లను చేర్చకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్కు తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఐక్య కార్యాచరణ కమిటీ దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వట్లేదని ప్రకటించింది. కాంగ్రెస్‌కు అండగా ఉంటామని తెలిపింది. తమను సంప్రదించకుండా మేనిఫెస్టోను ప్రకటించిందని, గతంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ముస్లిం సంఘాల జేఏసీ విమర్శించింది. తాము సూచించిన 22 డిమాండ్లల్లో ఏ ఒక్క దాన్ని కూడా బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో చేర్చలేదని ఆరోపించింది. ఎన్నికల ప్రచార సభల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ ఎక్కడా ముస్లింలకు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావి¸ంచట్లేదని జేఏసీ ధ్వజమెత్తింది ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం బాగా పెరిగినట్లనిపిస్తోంది. కాంగ్రెస్ దీనికి భిన్నంగా- తన మైనారిటీ డిక్లరేషన్‌పై తమను సంప్రదించిందని, దీనితో పాటు తమ ఎనిమిది ప్రధాన డిమాండ్లను కూడా మేనిఫెస్టోలో చేర్చిందని, మైనారిటీ సబ్ ప్లాన్ వంటి కీలక హామీలను ఇచ్చిందని గుర్తు చేసింది.
బీఆర్ఎస్ తమ డిమాండ్లను ఉద్దేశపూరకంగానే పక్కన పెట్టిందని, దీనికి ప్రధాన కారణం- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పరస్పర రాజకీయ అవగాహన ఉండటమేనని ఆరోపించింది. బీఆర్ఎస్- బీజేపీ మధ్య కొనసాగుతున్న రహస్య మైత్రిని తెలంగాణ ముస్లిం సమాజంగా గమనించిందని, అందుకే అధికార పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వివరించింది. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లను కల్పిస్తామంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటించిందని, ఇప్పటికీ దాని ఊసే లేదని, మేనిఫెస్టోలో కూడా ఈ అంశం లేదని పేర్కొంది. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా ముస్లింలు అందరూ కాంగ్రెస్‌కు వోటు వేయాలని పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు.
మోదీపై ఖర్గే విమర్శనాస్త్రాలు
ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే వివిధ ప్రాంతాలలో ప్రచారసభల్లో పాల్గోంటూ , నల్లధనాన్ని వెనక్కి తెచ్చి, ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ మాటతప్పారని.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలేమయ్యాయని నిలదీశారు. ‘‘మోదీ పాలనలో పేదల బతుకు భారమైంది. నిత్యావసరాలు పెరిగాయి. కాంగ్రెస్ హయాంలో నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులను కట్టించాం. 60 లక్షల ఎకరాలను పేదలకు పంచిపెట్టాం. కాంగ్రెస్ ఏంచేసిందని ప్రశ్నిస్తున్న వారికి ఇవన్నీ కనిపించడం లేదా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలనే సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. ఆమె దయతో అధికారాన్ని అనుభవిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఇందిర, సోనియా, రాహుల్‌లను దూషిస్తున్నారని, ఇది అన్నం తినే కంచంలో ఉమ్మడమేనని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ సర్కారు వచ్చాక సీఎంతోపాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం అవుతారు. కేసీఆర్‌లాగా ప్రగతిభవన్, ఫామ్హౌసకు పరిమితం కారు. కాంగ్రెసను ఓడిరచేందుకే మోదీ, కేసీఆర్, ఒవైసీ ఒక్కటయ్యారు. ల్యాండ్, సాండ్, లిక్కర్, మైన్ మాఫియాలతో తెలంగాణ సంపదను కేసీఆర్ దోచుకుంటున్నాడు. పేదల వ్యతిరేకి అయిన బీఆర్ఎసను ఓడిరచేందుకు ప్రజలు ఏకమవ్వాలి’ అని పిలుపునిచ్చారు.
పోటీ లేని చోట్ల సిపిఎం సహా, కాంగ్రెస్‌కు పలుపార్టీల మద్దతు
ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ మినహా మిగతా నాలుగు చోట్లా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. ఆ పార్టీని అధికారం నుంచి దించడమే తమ లక్ష్యమని జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీని అధికారం నుంచి దించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. . ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేద్దామని తమతో చెప్పిన బీఆర్ఎస్.. ఆ తర్వాత వదిలేసిందని, ఆ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలని ఏచూరి వ్యాఖ్యానించారు.
రాజ్యాంగాన్ని ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ వంటివాటిని మోదీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని.. ఈడీని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఎంత అవినీతి చేసినా బీజేపీలో చేరితే నీతిపరులైపోతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేందుకు దేశంలో ఉన్న ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెసతో సీపీఎంకు పొత్తు కుదరకపోవడంపై వారే వివరించాలని అన్నారు. పోటీ లేని చోట్ల కాంగ్రెస్‌కు సి పి ఎం మద్దతు నిస్తుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సి.పి.ఐ, ముందుగా ఒక అవగాహనకు వచ్చిన టి.వై.ఎస్.ఆర్.సి పి, తమ అభ్యర్థులు లేచోట్ల బహుజన్ సమాజ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి ఇందిరా గాంధీ హయాంలోనే దేశాభివృద్ధి జరిగిందని, ఉద్యోగ కల్పన, భూ సంస్కరణలు, పారిశ్రామిక వృద్ధి, ఇళ్ల నిర్మాణం, భూపంపిణి వంటివి ఇందిరా హయాంలోనే జరిగాయని, కాంగ్రెస్ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని చెప్పారు. హైదరాబాద్ కు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని. చెన్నారెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందాయని,, నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణ శకం మొదలు కాగా, ఐటి కి విత్తునాటి హైటెక్, సైబర్ టవర్స్ శంకుస్థాపనలకు కారకులు నేదురుమల్లి కాదా అని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని పరిణమాలతో అభిమానం దెబ్బతిన్న రాష్ట్రంలోని తెలుగుదేశం అభిమానులు, గత పాతికేళ్ళుగా ఐ టి రంగంలో వెలుగుతూ నగరంలో పరిసర ప్రాంతాలలో స్థిరపడిన యువతరం వోటర్లు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కే వోటు చేస్తారన్న ఆశ కూడా కాంగ్రెస్ నేతలలో ఉంది. రాష్ట్రంలో డా.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు, అరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మంట్, ఇరిగేషన్ ప్రాజెక్టుల విస్తరణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఐటీని ప్రమోట్ చేసింది కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని, లక్ష్మి సైబర్ సిటీ, పివి ఫ్లై ఓవర్ నిర్మాణం ట్రిపుల్ ఐటి ల ఏర్పాటు, అనేక చోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో రిమ్స్, స్విమ్స్ వంటి అధునాతన వైద్య శాలల నిర్మాణం ముఖ్యమంత్రి డా.రాజశేఖర రెడ్డి హయాంలోనే నని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలే నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
–నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్,
98481 28215