అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం తీర్మానం
కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు..?
ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతి రేకిస్తున్నట్టా..?
దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం
ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతి
దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం
సభలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు
శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి
ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేఆర్‌ఎంబీపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి
ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేఆర్‌ఎంబీపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితిలోనూ కెఆర్‌ఎంబికి తద్వారా కేంద్రానికి అప్పగించేది లేదని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. అందుకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని పెట్టిందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతిస్తున్నట్టా..? అసెంబ్లీకి హాజరు కానందున వ్యతిరేకిస్తున్నట్టా..? అని నిలదీశారు. ఒకప్పుడు ఎంపీగా బిక్ష పెట్టిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలే పట్టని కేసీఆర్‌కు తెలంగాణ ప్రయోజనాలు పడతాయా? అని ఆయన నిలదీశారు. రాష్ట్ర బడ్జెట్ సెషన్ సోమవారం కృష్ణా జలాలపై ఇరు అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఇలాంటి కీలక సమయంలో సభకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉందని సీఎం పేర్కొన్నారు. హరీష్ రావు సభలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత చర్చల్లో పాల్గొనకపోవడాన్ని తప్పుపట్టారు. కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే ఒక వ్యక్తి ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుంచి తరిమికొడితే.. మహబూబ్‌నగర్ వాసులు ఎంపీగా గెలిపించారన్నారు. ఇంత ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు కేసీఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో కీలక ఘట్టంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దక్షిణ తెలంగాణ ప్రాణ ప్రదమైన కృష్ణా జలాలపై అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం చర్చ పెట్టిందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన నీళ్లపై కీలక చర్చ జరుగుతున్నప్పుడు..ఆ వ్యక్తి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. మరోవైపు బీఆర్‌ఎస్ నేత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పద్మారావును నిజమైన తెలంగాణ ఉద్యమకారుడిగా పేర్కొన్నారు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు చేస్తే బాగుంటుందన్నారు. 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారని.. ఈ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ అనుకూలమా కాదా చెప్పాలి? అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే…కేఆర్‌ఎంబీపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్‌ఎంబీ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారమని..రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాడు విఫలమైందని ధ్వజమెత్తారు. కృష్ణాజలాలపై గత ప్రభుత్వం సరైన వాదనలను వినిపించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం అదనపు నీటిని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇన్ ఫ్లో తగ్గి.. డైవర్షన్ పెరిగిందన్నారు. పాలమూరు- రంగారెడ్డికి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ హయాంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయినట్లు పేర్కొన్నారు. 811 టీఎంసీలలో కేవలం 299 టీఎంసీలనే క్లెయిమ్ చేశారని.. అలాంటి బీఆర్‌ఎస్ 50 శాతం కావాలని మాట్లాడటం వింతగా ఉందన్నారు. చేసిందంతా చేసి.. నల్లగొండలో సభ పెడితే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు.

నీటి పంపకాల విషయంలో గత ప్రభుత్వం ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా మిన్నకుండిపోయిందన్నారు. ఏపీ సీఎం జగన్ కు.. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణా జలాలను ధారపోశారని ఘాటు విమర్శలు చేశారు. ఇకపై సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణాజలాలను తరలించే ప్రసక్తే లేదన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికీ అప్పజెప్పే ప్రసక్తే లేదన్నారు. కృష్ణాజలాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. నదీజలాల పంపకాల్లో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయమే జరుగుతుందని మంత్రి ఉత్తమ్ వాపోయారు. బీఆర్‌ఎస్ వచ్చాక కృష్ణాజలాల్లో మరింత అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో.. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో ఢల్లీికి వెళ్లి 299 టీఎంసీలు పంపకానికి ఒప్పుకుని.. నీటి వాటాలో తెలంగాణకు శాశ్వత నష్టం చేశారని దుయ్యబట్టారు. కృష్ణాజలాలపై ఏపీ సీఎం జగన్, కేసీఆర్ ఏకాంత చర్చలు జరిపారని.. ఈ విషయాన్ని స్వయంగా జగనే అసెంబ్లీలో చెప్పారన్నారు. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీరు ఏపీకి వెళ్తుందని, దీనిపై ఎప్పుడైనా కేసీఆర్ నోరువిప్పి మాట్లాడారా ? అని ప్రశ్నించారు. నాడు బీఆర్‌ఎస్ చేసిన ఘనకార్యంతో.. నేడు నాగార్జునసాగర్ డ్యాం ఎండిపోయే పరిస్థితి వొచ్చిందన్నారు.