ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసీడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 5 : ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసిడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలవరించడం ప్రభుత్వంకు చెంపపెట్టులాంటిది రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ,హైకోర్టు ఫార్మాసిటీకి స్టే విధించడం అది రైతుల విజయం అని తెలంగాణ ప్రభుత్వం పేదల భూములను తీసుకొని బడా వ్యాపారులకు అధిక ధరలకు అమ్మడం జరిగిందని,సన్న కారు రైతులకు నష్టపరిహారం కింద కేవలం 10 లక్షల రూపాయలు ఇవ్వడం రైతులకు మోసం చేయడమెనన్నారు.ఆ భూములు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నారు.రైతులకు జీవనోపాధి కింద ఇవ్వడం జరిగిందని,తెలంగాణ ప్రభుత్వం ఫార్మసిటీ తేవడం వలన ఇక్కడ ప్రాంతమంతయు కలుషితమవుతోందని తెలిపారు.ఇక్కడున్న ప్రజలు వాసన పీల్చుకుంటే ఈప్రాంతం అంత కూడా దుర్వాసనలో ఉండలేకపొతారని అన్నారు. ఈ ప్రాంతంలో ఫార్మసిటీ రాకుండా  రైతులకు ఇప్పుడు ఉన్న ధర ఒక ఎకరానికి కోటి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ  తరపున పోరాటం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.ఫలితంగానే  నేడు కోర్టు స్టే విధించడం జరిగిందన్నారు.ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page