పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లోని బండల మల్లన్న జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు పెద్ద గొల్ల మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం యాదవ్, విష్ణు యాదవ్, లక్ష్మణ్ యాదవ్, కృష్ణ యాదవ్, మల్లేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.