బడిఈడు పిల్లల నమోదుతో పాటు నిలకడపై దృష్టి సారించాలి

సమాజం సర్వతో ముఖా భివృద్ధి సాధించాలంటే బాల బాలిక లందరూ విధిగా చదువుకొని తీరాలి. అందుకు పాఠశాలే సరియైన చోటు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించటం, మధ్యలో బడిమాని వేయకుండా కనీసం 8 వ తరగతి పూర్తి చేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం బాధ్యత వహించాలి.
నూరుశాతం నమోదు మరియు నిలకడ సాధించాలంటే సమాజ సహకారం ఎంతైనా అవసరం. ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిద ండ్రులు, విద్యావేత్తలు, స్వచ్చంధ సేవా సంస్థలు ప్రజాప్రతినిధులు బడి మనదే… పిల్లలూ మన వారే అనే భావనతో పనిచేయాలి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6-14 సం  పిల్లల ందరూ బడిలో చేరి, ప్రతిరోజు హాజరవుతూ ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరి పైన ఉంది.

6 – 14 సం వయస్సు గల పిల్లలందరిని పాఠశాలలో చేర్పించి, నిలుపుదల సాధిం చటానికి ఈ క్రింది కార్యక్రమాలను చేపట్ట వలసిన అవసరం ఉంది.

1.ప్రతి ఆవాస ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించి, అకడమిక్‌ ‌మానిటరింగ్‌ ‌కమిటీ సభ్యుల ద్వారా బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించేటట్లు చూడటం.
2.పిల్లలు తమ బాల్యాన్ని ఆనందంగానూ, అర్థవంతంగానూ కొనసాగించాలంటే పాఠశాల దానికి సరైన ప్రదేశం అనే ప్రచారం చేయటం.
3.పిల్లలు బడిమానేయకుండా ఉండాలంటే బడి అందంగాను ఆకర్షణీయంగాను ఉండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు ఆటలు, పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం
4.ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం – 2009 పై చక్కని అవగాహన కల్గించటానికి ర్యాలీలు, కళాజాతాలు, సమావేశాలు, కరపత్రాలు మరియు పోస్టర్ల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం.
5.బడిమానేసిన మరియు బడిలో చేరని పిల్లల తల్లిదండ్రులకు విద్య పట్ల అవగాహన కల్పించి పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించటం.
6.ఇంటి పనుల్లో కార్కానాల్లో, ృటళ్ళలో, క్వారీల్లో, వ్యవసాయ పనుల్లో మరియు ప్రమాదకరమైన పనుల్లో మగ్గుతున్న పిల్లలకు విముక్తి కల్గించి, మొదటగా వయస్సుకు సరిపోయే తరగతుల్లో చేర్పించాలి. తర్వాత ప్రత్యేక శిక్షణ కేంద్రాల ద్వారా ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసేలా చూడటం
7.వలస పిల్లల కోసం వర్క్ ‌సైట్‌ ‌పాఠశాలలు, సీజనల్‌ ‌హాస్టళ్ళను ప్రారంభించాలి, పట్టణ ప్రాంతంలోని అణగారిన వర్గాల పిల్లల కోసం రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలు ఏర్పాటు చేయటం.
8.బడిలో చేరిన బాల బాలికలకు మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు, నోటుబుక్స్, ‌టెక్టస్ ‌బుక్స్ అం‌దించటం
9.బాల ఆరోగ్య రక్ష పథకం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం.
10.ప్రత్యేకావసరాలు గల పిల్లలను కూడా పాఠశాలల్లో చేర్పించి అందరితో పాటు విద్యనందించడం,
11.పాఠశాలకు వెళ్ళలేని (తీవ్ర, అతితీవ్రవైకల్యం) పిల్లలకు ఇంటి వద్దనే రీసోర్స్ ‌టీచర్ల ద్వారా విద్యనందించడం.
పై కార్యక్రమాల ద్వారా బాల్యానికి భరోసానిస్తూ బాలకార్మిక రహిత సమాజం కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేయాలి.
పిన్నింటి బాలాజీ రావు, వరంగల్‌ ‌జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్‌)
9866776286

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page