బరి నుంచి తప్పుకున్న మరో ముగ్గురు

ఫలించిన మంత్రి ఎర్రబెల్లి ప్రయత్నం
నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు చొరవతో మరో ముగ్గురు అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరినుంచి తప్పుకున్నారు. ఇప్పటికే పదిమంది ఉద్యమ యువకులతో మాట్లాడి పోటీ నుంచి విరమించుకునేలా చేసిన మంత్రి.. తాజాగా ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. వరంగల్‌ ‌జిల్లా ములుగుకు చెందిన కనకం దేవదాసు, మల్లికార్జున్‌, ఎ‌ర్ర బచ్చల ప్రభుచిత్తం.. ఈ ముగ్గురు మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ములుగు జడ్పీ ఛైర్మన్‌ ‌కుసుమ జగదీశ్‌ ‌సూచనల మేరకు ములుగు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ‌గోవింద నాయక్‌? ఆ ‌ముగ్గురు అభ్యర్థులను మంత్రి వద్దకు తీసుకెళ్లారు.

మంత్రి వారితో చర్చించి, స్వచ్ఛందంగా మునుగోడు ఉప ఎన్నిక బరిలో నుంచి తప్పుకునేలా ఒప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ? ‘మేము కొన్ని అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిష్కరిస్తామని మంత్రి హావి• ఇచ్చారు. మంత్రి హావి• మేరకు ఎన్నికల బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాం. నామినేషన్లు ఉపసంహరించుకుటాం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం కోసం పనిచేస్తాం. తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ‌మాత్రమే పనిచేస్తుందని నమ్ముతున్నాం. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు తెలంగాణకు చేసిందేవి• లేదు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం ఉప ఎన్నికలు తెచ్చింది’ అని అన్నారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ? బీజేపీతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేవి లేదు, భవిష్యత్తులో ఒరిగేదేవి లేదని అన్నారు. మాయమాటలతో ప్రజలను బీజేపీ వంచిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపైనే కాకుండా అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వారిని మంత్రి అభినందించారు. మునుగోడు ఉప ఎన్నిక బరిలో నుంచి నిన్న పది మంది, ఇవాళ ముగ్గురు తప్పుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే వారిని సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌వద్దకు తీసుకెళ్లి సమస్యల పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page