బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
చర్ల, ప్రజాతంత్ర, జూన్ 15: భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని బహుజన సమాజ్ వాదీ పార్టీ (బియస్పి) రానున్న ఎన్నికల్లో గెలుసుకుంటుందని బియస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేసారు. బహుజన రాజ్యాధికారమే ద్యేయంగా తలపెట్టిన యాత్ర తొంబైవరోజు బుదవారం చర్ల మండలంలో సాగింది.రాళ్లగూడెం, మామిడిగూడెం, కుదునూరు, తెగడ గ్రామాల మీదుగా మద్యాహ్నం మూడుగంటలకు చర్లకు చేరుకున్నారు.భోజనాల అనంతరం ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు నానమాద్రి కృష్ణార్జునరావు గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుజనులంతా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. రాజ్యంగంలో పొందపరిచిన ఐదవ షెడ్యూల్డ్ ను అమలు చెయ్యాలని ప్రభుత్యాన్ని డిమాండ్ చేసారు. మండల పర్యటనలో ఆదివాసీలు ప్రధానంగా పొడుభూముల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టి వచ్చిందన్నారు.కేసీర్ ఒక పక్క సర్వేలు అంటునే ఫారెస్ట్ అధికారులతో భూములను లాక్కుంటున్నారని విమర్శించారు.
వలస ఆదివాసీలు ఎన్నోఏళ్ల క్రిందట అక్కడకు వచ్చి స్థిరపడ్డారని వారికి ఇప్పుడు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో వారి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు బ్రతికేందుకు పూర్తి హక్కులు ఉన్నాయని జివో నెం3 పతిష్టంగా అమలు చెయ్యాలని అన్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్ని వనరులను ఉపయోగించుకొంటున్న ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధిని మాత్రం మరిచింది అన్నారు. వేలకోట్లతో హట్టహసంగా ప్రారంబించిన మిషన్ భగీరథ పధకం ఇక్కడ ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. మూడురోజులకొకసారి నీళ్లు వస్తున్నాయని ఇక్కడి ప్రజానికం అంటున్నారని అన్నారు.
ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడంతో పూర్తిగా విఫలం అయ్యందని అన్నారు. బహుజన రాజ్యాధికారం ద్వారానే ప్రజ సంక్షేమం జరుగుతుందని ప్రజలందరూ బహుజన రాజ్యం కోసం కృషిచెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లో బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్ర. కామేష్, జిల్లా ఇంచార్జ్ లు ఇర్పా. కామరాజు, గంధం. మల్లికార్జున్ రావు, తడికల. శివకుమార్, విస్సంపల్లి. నరసింహారావు, అసెంబ్లీ అధ్యక్షులు ముఖేష్, మండల అధ్యక్షులు కూరపాటి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.