మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ సిపి ఆఫీసులో మర్రి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బిఆర్ఎస్ నాయకులపై నా నెంబర్ తో మిమ్ములను మీ కుటుంబాలను చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచినందుకు నాపై మా నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. సిపికి ఫిర్యాదు చేసామని, త్వరలో దుండగులపై చర్యలు తీసుకొని అరెస్టు చేస్తామని సిపి పేర్కొన్నారు.