పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 10: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో పరిపాలన అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ విజయానికి సహకారం అందించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని స్నేహ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఒకటి రెండు మూడు వార్డులలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంపై శ్రద్ధ లేని ప్రతిపక్ష పార్టీలు కేవలం సీట్లను అమ్ముకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు.. ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థితో చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. దార్శనిక నాయకుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.