శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆదిల్ పటేల్ ఆధ్వర్యంలో 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి బారసా అభ్యర్థి అరకపూడి గాంధీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా బారాస ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షణ ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన అనేకమంది బారాస పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఇప్పటికే శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో 9,000 కోట్ల రూపాయలతో సంక్షేమం అభివృద్ధి చేశానని, చెరువుల సుందరీకరణ, నాలాల అభివృద్ధి, ఇంటింటికి మంచి మీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐటీ కంపెనీలతో రద్దీగా మారిన శేరిలింగంపల్లిలో అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు, ఇన్నర్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించి ప్రయాణం సాఫీగా సాగేందుకు కృషి చేశామని తెలిపారు. సాయంత్రం ఉదయం వేళ సేద తీరేందుకు అనేక పార్కులను అభివృద్ధి పరచామని తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడికెళ్లిన ప్రజలు తనకు మద్దతు తెలుపుతున్నారని ప్రజలందరి ప్రజలందరూ ఆశీస్సులు మద్దతు శేర్లింగంపల్లి లో ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో ముఖ్య నాయకులు అస్లాం,సఫరాజ్,షేక్ మసూద్, అబ్దుల్ మన్నన్,యసీన్, ఫిరోజ్,అక్బర్ ,సమీర్ ,యూసఫ్, యాసీన్, అమీర్, జమిర్, ఆయుజ్, ఇర్ఫాన్,లతీఫ్ ఖాన్ ,సలీం ,ఇమ్రాన్ ఖాన్ వారి అనుచరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అఖిల్ పటేల్ ఎం డి ఇబ్రహీం, దీపక్ , కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయభిలాషులు పాల్గొనడం జరిగింది.