ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 13: వైఎస్ఆర్ టిపి నియోజకవర్గ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.సోమవారంరంగారెడ్డి జిల్లా విద్యార్థి
విభాగం ప్రధాన కార్యదర్శి దూసరి వేణు ప్రసాద్ గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తాళ్ల సాయికుమార్ గౌడ్,రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గ సభ్యులు తాళ్ల అఖిలేష్ గౌడ్ ల అధ్వర్యంలో చంద్రగిరి,సందీప్ కుమార్ ముదిరాజ్,ఎస్కే.జావిద్,గొడుగు భాస్కర్, మాన్ కార్ సంజు,సునీల్,యమినేని సురేందర్ గౌడ్,రామ్ గౌడ్,వంగపల్లి శ్రీనివాస్,బర్తాకి శరత్ కుమార్,సింహద్రి,తప్ప సాయి కిరణ్,నోసు ప్రేమ్ రాజ్,బర్తాకి శరత్ కుమార్,బండి నవీన్ కుమార్ తదితరులు వైయస్సార్ టిపి పార్టీని వీడి నియోజకవర్గాన్ని ప్రగతి బాటలోనడిపే భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాయకులు క్యామ మల్లేష్,మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిలు వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా మంచిరెద్ది కిషన్ రెడ్డి మాట్లాడుతూ,కెసిఆర్ ప్రభుత్వం చెసినా అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలనే దృక్పథంతో బిఆర్ఎస్ లో చెరుటున్నారని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.