కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 22 : మహేశ్వరం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న బిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బిజెపి ముందు నిలుస్తారా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ చిత్రం ముఖ పోటీలో గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు చేసింది ఏమిటి అనే సందేహాలు బలోపేతంగా వినిపిస్తున్నాయి.గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన చేవెళ్ల చెల్లెమ్మగా పేరు తెచ్చుకున్న పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతి గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు.అనంతరం రాజకీయ సమీకరణాలు మారిన కొద్దీ చేవెళ్ల ఎస్సీ నియోజకవర్గం అప్పటి నుండి 2009లో మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు.తద్వారా రెండు పర్యాలుగా గెలుపొందారు.అప్పటి నుండి ప్రజల్లో చైత్యనం చేసుకుంటున్న ఆమె ప్రజజల ఆశీర్వాదంతో ప్రజల్లో మమెకమై పాలయ్ అభివృద్ది కార్యక్రామాలు కొనసాగిస్తూ అందరితో మమెకమై ఉన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో రెండు పర్యాలుగా గెలుపొందారు.కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపు దిశగా ప్రయాణించిన రెండో దశలో ఓటమిపాలయ్యారు.తద్వారా మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేశారు.బిసి బిడ్డ అయినా అందెల శ్రీరాములు యాదవ్ 2018 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల్లో అందేల అనే వ్యక్తి ఎవరికీ పార్టీలో సైతం తెలియలేని పరిస్థితిలో ఉన్న సుమారు 40 వేల వరకు ఓట్లు తెచ్చుకొని పార్టీని బలో పేతం చేసిన నానుడిగా పేరు తెచ్చుకున్నారు.2023 తాజా ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో నువ్వా నేనా అన్న చందంగా పోటీ ఉన్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం అందేల గెలుపు ఖాయమని భరోసా ఇస్తున్నారు.కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సబితారెడ్డిలు తామే గెలుస్తామని ధీమాగా ఉన్న వారిలో అంతర్ మదనం మొదలైందని వారు భావిస్తున్నారు.ఏది ఏమైనాప్పటికీ గ్రామాల్లో ఉన్న యువత బిజెపి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.బిజెపి,కాంగ్రె