బిసి కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ లోకి ? 

 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గూడెంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బిఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గంలో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఇంచార్జ్ లను రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి బంగపడిన ఓ నేత బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు గూడెంలో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ సీటు సిపిఐకి కేటాస్తారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ ను నమ్ముకుని నట్టేట మునగడం కంటే ముందే మేలుకోడం మంచిది అనే ఆలోచనలో ఆ నేత ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి కాంగ్రెస్ మొండి చెయ్యి ఇస్తుందని  గ్రహించిన బిసి నేత ఇక కాంగ్రెసులో ఉంటే ఉపయోగం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా పార్టీనే నమ్ముకుని ఉన్నా కాంగ్రెస్ అసలు విషయాన్ని నాన్చుతుందని గ్రహించి పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. బిఆర్ఎస్ లోని అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెలీ నాయకుడు ఇప్పటికే మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శత్రుత్వాన్ని మరిచి గెలుపుకు పనిచేస్తారా ? 
కాంగ్రెస్ కండువా తీసేసి అధికార పార్టీ బిఆర్ఎస్ వైపు
ఒడి ఒడిగా అడుగులు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఒక ప్రముఖ నేత టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ చర్చలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ నేతకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించారని సన్నిహితులు అంటున్నారు. పొత్తులో భాగంగా  కొత్తగూడెం సీటు సిపిఐకి కేటాయించక ముందే బిఆర్ఎస్ తీర్ధం పుచుకుంటే  పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కుతుందని  ప్రముఖ నేత నచ్చజెపారని,  సిఎం కెసిఆర్, కేటీఆర్ తో స్పష్టమైన హామీ ఇప్పించి బిఆర్ఎస్ కండువా కప్పే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు  నియోజకవర్గంలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. శత్రుత్వాన్ని మరచి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు బిసి నేత సహకారం అందిస్టారని సన్నిహితులు వాపోతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు అనే నానుడి ఉండనే ఉంది.  ఇది నిజం చేసేలా ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం వేదికగా రాజకీయాలు నిలవబోతుందని అనే అంశం రాజాకీయ వర్గాల్లో చర్చ నడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page