తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి సోమవారం తాండూరు మండలం సిరిగిరి పెట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటప్ప ఆధ్వర్యంలో సుమారు 500 మంది నాయకులు కార్యకర్తలు డిసిసిబి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనొహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలకుల ముఖం చూసి ప్రజలు విసిగిపోయారని, ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారంటే తండోపతండాలుగా వస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని అన్నారు. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని అన్నారు.కెసిఆర్ పాలనలో దగా, అవినీతి, కుటుంబ రాజకీయాలు చేస్తూ కుంభకోణాలు, నిరుద్యోగులను మోసం చేస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దత్తు గా నిలబడి, నియంతృత్వ నిరంకుశ పాలనకు గద్దె దించాలని అన్నారు. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బిఅర్ఎస్ పార్టీకి భయం పుట్టుకుందని, కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. అయిదేండ్లలో తాండూర్ లో ఏమి అభివృద్ది చేశారో అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలన్నారు. ఇప్పటికే కారుకు ఆల్రెడీ టైర్లలో గాలి పోయిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6గ్యారెంటీ పథకాలు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ కే సాధ్యమన్నారు. ఎన్నికలు వచ్చేసరికి సిలిండర్ 400 ఇస్తామని చెప్పడం బీఆర్ఎస్ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కెసిఆర్ ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం అబద్ధమేనని ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ వడ్డే శ్రీను,పలువురు వార్డ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.