- తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పాలకులకు గుణపాఠం చెప్పే విధంగా వోటును వాడుకుందాం
- పౌర సమాజ వేదికలు పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : ‘‘లక్షలాది ప్రజల ప్రజాస్వామిక పోరాటం ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాలరాసి, నిరంకుశ పాలనతో, ఆవినీతితో ప్రజల వనరులను దోపిడీ చేస్తూ, విద్యార్థులను, నిరుద్యోగ యువతను మోసం చేసిన బీఆర్‌ఎస్ పార్టీని రాష్ట్ర పౌరులు గట్టిగా వ్యతిరేకించాలి. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే ప్రజలు పాలకులకు గుణపాఠం చెప్పే విధంగా ఈ ఎన్నికలలో తమ వోటును వాడుకోవాలి,’’ అని ప్రజా ఉద్యమాల ప్రముఖులు పిలుపును ఇచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని పౌర సమాజ వేదికల ముఖ్యులందరూ కలిసి హైదరాబాద్ సామాజి గూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ పౌరులకు ఉమ్మడి పిలుపును ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ పీపుల్స్ జే.ఏ.సి., జాగో తెలంగాణ, ముస్లిం సంఘాల జే.ఏ.సి., భారత్ బచావో, తెలంగాణ సమాఖ్య, భారత్ జోడో అభియాన్ వేదికల నాయకులు, ప్రజా ఉద్యమాల ప్రముఖులు పాల్గొన్నారు.
‘‘లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టిన తర్వాత తప్పు డిజైన్ వలన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలడం, 22 లక్షలు ఉన్న కౌలు రైతులను గుర్తించకూడదన్న మొండి వైఖరి, టీ.ఎస్.పీ.ఎస్.సి. నిర్వాకం, టీచర్లు మొదలుకొని అన్ని ప్రభుత్వ విభాగాలలో పోస్టులు ఖాలీ గా పడి ఉండటం, వేలాది స్కూళ్ళు బందు పడటం, రెండు బెడ్రూమ్ ఇళ్ళు, దళిత బంధు, దళితులకు మూడెకారాల భూమి వంటి అనేక స్కీముల వైఫల్యం, కుటుంబాలను ధ్వంసం చేస్తున్న మద్యం %–% ఇవన్నీ ఈ ప్రభుత్వం పాలనా వైఫల్యాలకు, ముఖ్యమంత్రి ఏక పక్ష ధోరణికి పరాకాష్టగా ఉన్నాయి. అంతే గాక, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విమర్శించే ప్రజా సంఘాలను, ప్రతిపక్షాలను గొంతు నొక్కి, అధికారులను, నిపుణులను కూడా మాట్లాడానివ్వకుండా నిర్బంధపూరిత వాతావరణంతో రాచరిక తరహా పరిపాలన కొనసాగుతున్నది.’’ అని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేసారు. ‘‘అదే సమయంలో గత పదేండ్ల కేంద్ర బీజేపీ పాలనలో దేశంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొదలుకొని నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది. రైతు వ్యతిరేక చట్టాలు, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, నోట్ల రద్దు, దేశ వనరులన్నీ ఆదానీ వంటి బడా కార్పొరేట్లకు అప్పగించడం %–% వంటి విధానాలతో కేంద్రం సామాన్య ప్రజలకు వ్యతిరేకం, కార్పొరేట్లకు అనుకూలం అని నిరూపించుకుంది.
అంతే గాక, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే సంఘాలు, వ్యక్తులు, మీడియా పై సిబిఐ, ఈడీ, ఇన్కమ్ టాక్స్ ద్వారా నిరంకుశ దాడులు చేస్తూ, రాజ్యాంగ హక్కులపై దాడి చేయడమే కాక, భారత రాజ్యాంగాన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, ముస్లింలపై, క్రిస్టియన్ల పై, దళితులపై దాడులు చేస్తున్న, మణిపూర్ లో జరుగుతున్న మారణ కాండను కొనసాగిస్తున్న బీజేపీ పార్టీ స్వభావాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకించడం మన కర్తవ్యం,’’ అని వేదికల నాయకులు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తెర వెనుక ఒప్పందాలతో కలిసి వ్యూహం చేస్తున్నట్లు కనిపిస్తోందని, కాబట్టి రెండు పార్టీలను కలిపి వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వొచ్చినా, ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వాలను నిలదీసి అడిగే విధంగా తమ వేదికలు పని చేస్తాయని నాయకులు తెలిపారు.
ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణలో ప్రజలందరూ కూడా ప్రశ్నించే గుణాన్ని, నిలదీసే ధైర్యాన్ని మరింత పెంపొందించుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ప్రయోజనాలను కాపాడుకోగలమని తమ నమ్మకం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ప్రొఫెసర్ జి.హరగోపాల్,కన్వీనర్,తె