రాష్ట్రంలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 5: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం మేనని వికారాబాద్ జిల్లా తాండూరు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పట్టణంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దీవెన సమావేశంలో పట్టణంలోని స్వర్ణకారులు సెంట్రింగ్ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు సమస్యల్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వం లోనే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని తాండూరులో ఇంతకుముందెన్నడూలేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. కేవలం రెండేళ్లలోనే రూ.16 వందల 80 కోట్లు తీసుకొచ్చి రికార్డు సృష్టించాడని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి ఇంతకు మించిన అభివృద్ధిని చేసి చూపిస్తా అన్నారు. ప్రజా దీవెనలతో ఈ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి తాండూరులో గులాబీ జెండా ఎగరేస్తా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ రామకృష్ణ టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు న్యాయవాది గోపాల్ సర్ణకారుల సెంట్రింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.