హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, ఈటల, వివేక్ వెంకట స్వామి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హెచ్ఐసీసీ నోవాటెల్‌కు మోడీ వెళ్లారు.
ఈనేపథ్యంలో నోవాటెల్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మోడీ సాయంత్రం 4 గంటల వరకు రెస్ట్ తీసుకుని రాత్రి 9 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. హెచ్ఐసీసీకి ప్రధాని మోదీ చేరుకున్నారు. కాసేపటికి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.ప్రధానికి స్వాగతం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికానన్నారు.
సీఎం తప్పనిసరిగా స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు. గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు. బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్ అభివృద్ధి చూడాలని తలసాని అన్నారు.