భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు ఆదివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైద్య సాయం 10 లక్షలు రూపాయలు పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పథకం కింద రాజు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. పేద ప్రజలకు ఇదొక వరం లాంటిదని ఆయన అన్నారు. ఈ పథకం శనివారం నుండి 10 లక్షల వరకు నగుతరహిత ప్రజలకు అందుబాటులో వస్తుందని ఆయన అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పేద ప్రజలకు వైద్య సాయం కింద 10 లక్షలు పెంచడం చాలా సంతోషకరమని పిఓ అన్నారు. భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ మాట్లాడుతూ ఈ ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షల కు పెంచటం సంతోషకరమని ఆర్డీవో అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీ ఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ , భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ ,తాసిల్దార్ శ్రీనివాస్ మరియు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.